వావ్.. అలరిస్తున్న బిగ్గుబాస్ గణపతి!

-

ఇప్పుడు ఏ బుల్లి తెర ప్రేక్షకుడిని అడిగినా బిగ్ బాస్ 2 గురించే మాట్లాడుతాడు. ఏ తెలుగింట్లో అయినా బిగ్ బాస్ 2 మీదే చర్చ. అంతలా జనాల్లోనే నానుతున్నది బిగ్ బాస్ షో. ఫస్ట్ సీజన్ పుల్ సక్సెస్ కావడంతో మళ్లీ నాని హోస్ట్ గా సెకండ్ సీజన్ ప్రారంభమయింది. ఇప్పుడు అది పూర్తవడానికి కూడా దగ్గరికొచ్చింది. ఎపిసోడ్స్ పూర్తవుతున్నా కొద్దీ ఎవరు విజేత అవుతారా? అని అంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరోవైపు కౌశల్ ఆర్మీ పేరుతో ఆయన అభిమానులు బయట రచ్చరచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ గణపతిని ఎవరో ఔత్సాహికులు వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో పాటు బిగ్ బాస్ థీమ్ తో ఏర్పాటు చేసిన గణేశ్ పండల్స్ కూడా భక్తులను ఆకట్టుకుంటున్నాయి. కౌశల్ ఆర్మీ పేరుతో ఓ పండల్ ను ఏర్పాటు చేశారు. కౌశల్ కు ఓటేయాలంటూ ఓ మండపాన్ని ఏర్పాటు చేశారు. బిగ్ బాస్ 2 లో గణేశ్ పూజ అంటూ మరో మండపాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news