50 లక్షల మందిని చంపే సామర్థ్యం ఉన్న డ్రగ్ ఇది..!

-

ఇదో విష రసాయనం. డ్రగ్. మత్తు కోసం ఉపయోగించే హెరాయిన్ డ్రగ్ కంటే 50 రెట్లు శక్తిమంతమైనది. మార్ఫిన్ కంటే 100 రెండు శక్తిమంతమైనది. రెండు గ్రాముల ఈ రసాయనం చాలు మనిషి ప్రాణం తీసేయడానికి. దీనిని పీల్చినా చాలు చావును చూడాల్సిందే. చాలా ప్రమాదకరమైన, భయంకరమైన రసాయనం ఇది. ఈ రసాయనం పేరు ఫెంటానిల్. ఇప్పుడు దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే.. ఈ విష రసాయనం భారత్‌లో పట్టుబడింది. ఏదో కొంచెం దొరికింది కాబోలు అని అనుకునేరు.. ఏకంగా 9 కిలోల ఫెంటానిల్ ఓ ల్యాబ్‌లో దొరికింది. దీంతో దాదాపు 50 లక్షల మందిని ఇట్టే చంపేయొచ్చు. రసాయనిక ఆయుధాల్లో ఉపయోగించినా భారీ నష్టం సంభవిస్తుంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ 100 కోట్ల రూపాయలకు పైనే. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ ల్యాబొరేటరీలో ఫెంటానిల్‌ను తయారు చేస్తుండగా డీఆర్డీవో శాస్త్రవేత్తలు, డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. నిజానికి ఫెంటానిల్‌ను డాక్టర్లు సర్జరీ సమయంలో రోగులకు ఇస్తుంటారు. మత్తు మందు సూదీ వేస్తుంటారు కదా నొప్పి తెలియకుండా. ఆ ఇంజెక్షన్‌లో దీన్ని ఉపయోగిస్తారట. కాకపోతే దాన్ని చాలా తక్కువ మోతాదులో రోగికి వేస్తారు కాబట్టి.. రోగికి ఎటువంటి సమస్యా ఉండదు.

అమెరికాలో ఈ డ్రగ్‌కు ఫుల్లు డిమాండ్. అందుకే.. అమెరికాకు ఎక్స్‌పోర్ట్ చేయడం కోసం దీన్ని తయారు చేయడానికి భారత్‌ను అడ్డాగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ ల్యాబ్‌ను నడుపుతున్న ఓ పీహెచ్‌డీ స్కాలర్, మెక్సికో వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఫెంటానిల్ డ్రగ్‌ను తయారు చేయడం అంత సులువు కూడా కాదు. చాలా నైపుణ్యం ఉండాలి. ఇదివరకు దీన్ని చైనాలో తయారు చేసి యూఎస్‌కు ఎక్స్‌పోర్ట్ చేసేవారు. కానీ.. చైనా అధికారులు డ్రగ్స్‌పై ఉక్కు పాదం మోపడంతో భారత్‌లో తయారు చేయడానికి పూనుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news