ఆ గ్రామంలో అందరు మరుగుజ్జులే.. లోపం పుట్టుకలో లేదు..కానీ శాపం ఏంటి?

-

పొట్టిగా ఉంటే.. ఆ బాధ ఎలా ఉంటుందో..అనుభవించేవారికే తెలుస్తుంది. చాలామంది హైట్ ఎదగడానికి ఏవేవో మందులువాడతుంటారు. జన్యుపరంగా పొట్టిగా ఉండొచ్చు లేదా.. పుట్టుకలో ఏదైనా లోపం ఉంటే ఇలా మరుగుజ్జుగా మారుతారు. కానీ ఓ గ్రామం అంతా మరుగుజ్జుగానే ఉంటే.. పుట్టుకలో ఎలాంటి లోపం లేదు..కానీ హైట్ మాత్రం ఎదగటం లేదు. అందరూ మూడు అడుగలుకు మించి లేరు. శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని సమస్యగా మారింది ఇది. ఆ గ్రామం ఏంటి.ఆ సమస్య ఏంటో పూర్తిగా తెలుసుకుందాం.

ఆ గ్రామంలో అందరు మరగుజ్జులే ఉండటంతో.. ఆ గ్రామం పేరు కంటే మరగుజ్జుల గ్రామంగానే పేరొందింది. మాకు ఇదేం శాపమో అని గ్రామస్తులు బాధపడుతుంటారు. ఆ వింత గ్రామం పేరు ‘యాంగ్సీ’. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఉంటుందీ గ్రామం. ఈ గ్రామంలోని మొత్తం జనాభాలో సగానికిపైగా మంది మరుగుజ్జులు. మూడు అడుగులు మించి ఎత్తు పెరగనే పెరగరు. కేవలం 2 అడుగుల నుంచి మూడు అడుగుల వరకు మాత్రమే ఉంటారు.. ఆ తరువాత పెరుగుదల ఆగిపోతుంది. అలా వారు మరుగుజ్జులుగా ఉండిపోతున్నారు.

పోని పుట్టుకల్లో ఏదన్నా సమస్యలున్నాయా..?

పుట్టుకలో ఎలాంటి సమస్యలు లేవు.. పిల్లలు బాగానే పుడతారు. ఎత్తు కూడా ఐదు నుంచి ఏడేళ్ల వరకు బాగా పెరుగుతారు. ఆ తరువాత నుంచి ఎత్తు పెరగటం సడెన్ గా ఆగిపోతుంది.అలా మూడు అడుగులు మించి పెరగకుండా మరుగుజ్జులుగా ఉండిపోతున్నారు యాంగ్సీ గ్రామస్తులు. అందరిలా తాము కూడా పొడవుగా ఉండే బాగుండు అని వారు బాధపతుడుతుంటారు. ఇక్కడ ఏదో దుష్టశక్తి ఉందని..దాని వల్లే తాము పెరగటంలేదని అక్కడివారు నమ్ముతుంటారు. యాంగ్జీ గ్రామానికి శాపగ్రస్త గ్రామం అనే నమ్మకం కూడా ఉంది. అదే నమ్మకాన్ని ఈనాటికి నమ్ముతుంటారు ఈ ప్రజలు.

జపాన్ దేశం చేసిన పనా..?

దీనికి కారణం జపాన్ దేశం చైనా వైపు విడుదల చేసిన విష వాయువు ప్రభావం వల్లే ఈ గ్రామంలో మరుగుజ్జు వ్యాప్తి చెందిందని కూడా కొందరు భావిస్తున్నారు. దీని వెనుక కారణాన్ని కూడా శాస్త్రవేత్తలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. నేలలు, మొక్కలు మరియు అన్ని రకాల వాటిపై శోధించారు. కానీ ఏమీ తెలియలేదు.

పాదరసం కారణంగానా..?

పరిశోధనల్లో భాగంగా గ్రామంలోని మట్టిలో పాదరసం ఎక్కువ మోతాదులో ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. దీనివల్ల ఇక్కడి ప్రజల ఎత్తు పెరగడం లేదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కానీ ఈ రహస్యానికి ఇప్పటి వరకు ఎవరూ ఖచ్చితమైన సమాధానం ఇచ్చింది లేదు.

దాదాపు 60 ఏళ్ల క్రితం ఒకప్పుడు ఈ గ్రామంలో ఒక విచిత్రమైన జబ్బు వచ్చిందని అప్పటినుంచే ఈ మరుగుజ్జుతనం వచ్చిందని..5 నుండి 7 సంవత్సరాల వయస్సు గల చిన్న పిల్లలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడ్డారనీ..అలా పెరుగుదల ఆగిపోయిందనే అభిప్రాయాలు కూడా కొందరిలో ఉన్నాయి. మొత్తానికి.. పిల్లలకు జన్మనిచ్చిన పెద్దలు, ఆ పిల్లలు 3 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు పెరగరు. అలా ముసలివారు..పిల్లలు అంతా ఒకటే హైట్ లో ఉంటారు. వీరికి ఈ సమస్య తీరేది ఎప్పుడో పాపం.

Read more RELATED
Recommended to you

Latest news