మృత్యుంజయురాలు.. 11వ అంతస్తు నుంచి కింద పడినా.. వైరల్ వీడియో

పక్కన ఉన్న బాల్కనీ రెయిలింగ్ ఎక్కి అటు వైపు వెళ్లబోయింది. కానీ.. అటువైపు దారి లేకపోవడంతో 11వ అంతస్తు నుంచి కింద పడిపోయింది. కింద పడేటప్పుడు చిన్నారి అరవడంతో హోటల్ సిబ్బంది కింద పడ్డ చిన్నారిని గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ఓ చిన్నారి 11వ అంతస్తు నుంచి కింద పడింది కానీ.. మిరాకిల్.. బతికింది. సాధారణంగా ఒక్క అంతస్తు నుంచి కింద పడితేనే చాలామంది మృత్యువాత పడుతుంటారు. కానీ.. ఈ చిన్నారి మాత్రం 11వ అంతస్తు నుంచి కింద పడినా బతికి బయటపడింది. ఈ ఘటన థాయ్‌లాండ్‌లోని పట్టాయా అనే పట్టణంలో చోటు చేసుకున్నది.

Girl survives fall from 11th floor hotel balcony while sleepwalking in Thailand

దీచా అనే వ్యక్తి తన ఐదేళ్ల‌ కూతురును తీసుకొని పట్టాయాకు వెళ్లాడు. అక్కడ పని ముగిశాక.. రాత్రి అక్కడే ఓ హోటల్‌లో వీళ్లు బస చేశారు. అయితే.. తన కూతురుకు నిద్రలో నడిచే అలవాటు ఉంది. దీంతో రాత్రి నిద్రలో నడుస్తూ రూమ్ నుంచి బయటికి వచ్చింది. తర్వాత మళ్లీ రూమ్‌లోకి వెళ్దామనుకునేసరికి రూమ్ డోర్ తెరుచుకోలేదు. దీంతో పక్కన ఉన్న బాల్కనీ రెయిలింగ్ ఎక్కి అటు వైపు వెళ్లబోయింది. కానీ.. అటువైపు దారి లేకపోవడంతో 11వ అంతస్తు నుంచి కింద పడిపోయింది. కింద పడేటప్పుడు చిన్నారి అరవడంతో హోటల్ సిబ్బంది కింద పడ్డ చిన్నారిని గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. పైనుంచి కింద పడటం వల్ల ఆ చిన్నారి కాలు విరిగిపోయింది. శరీరం మీద చిన్న చిన్న గాయాలు అయ్యాయి కానీ తన ప్రాణానికి మాత్రం ఏ ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు. అలా.. 11వ అంతస్తు నుంచి కింద పడినా మృత్యుంజయురాలైంది ఆ చిన్నారి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో హోటల్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.