వామ్మో.. ఇదేం కోతిరా బాబోయ్… పామునే చంపేసింది… వీడియో

-

కోతులు బాబోయ్ కోతులు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడికెళ్లిన కోతులు మాత్రం ఉంటూనే ఉంటాయి. అవి చేసే చేష్టలు కూడా అలాగే ఉంటాయి. అందుకే కోతులతో పెట్టుకోకూడదంటారు పెద్దలు. ఉత్తరప్రదేశ్ లోని వృందావన్ లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. వృందావన్ లోని బాంకే గుడి దగ్గర కోతుల బీభత్సం మామూలుగా లేదట. వాటి అల్లరి చేష్టలతో అక్కడి స్థానికులు విసుగెత్తిపోయారట. తాజాగా ఓ కోతి చేసిన చేష్టలు మాత్రం చర్చనీయాంశమయ్యాయి. పాములు పట్టే ఓ వ్యక్తి పాము తన బుట్టలో నుంచి తీసి దానికి సపర్యలు చేస్తున్నాడు. అంతే.. ఎక్కడి నుంచి వచ్చిందో ఆ కోతి గానీ.. ఒక్కసారిగా అక్కడికి వెళ్లి ఆ పామును చటక్కున చేతితో తీసుకొని అక్కడి నుంచి పారిపోయింది. దాని చేష్టలు చూసి అంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఏం జరిగిందా అని తేరుకునే లోపే అది పామును తీసుకెళ్లి చంపేసింది. ఆ పాములు పట్టే వ్యక్తి తన పాము కోసం కోతి వెంట పడ్డా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దీంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news