ఓరినాయనో..టాయిలెట్ తో వంటంట.. తింటే అసలు వదలరట..!

-

బాత్రూమ్ పరిసరప్రాంతాల్లో కనీసం తినటానికి కూడా ఎవ్వరు ఇష్టపడరు. కానీ ఏకంగా టాయిలెట్ తోనే వంటను చేస్తారు. అది కూడా అక్కడ ఫేమస్ అంట. ఎక్కడా అనుకుంటున్నారా… చైనాలోనే.. చైనీస్ వంటకాల మీద మనకు ఇప్పటికే ఒక అవగాహన ఉంది. ఎగిరేవి,పాకేవి, తేలేవి అని తేడాలేకుండా వాళ్లు అని లాగిస్తుంటారు. టాయిలెట్ తో ఉడకబెట్టిన గుడ్డును తింటారట. ఇది అక్కడ ఓ ప్రాంతంలో ప్రత్యేకమైన వంటకం..ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

చైనాలోని జెజియాంగ్‌లోని డాంగ్‌యాంగ్లో మూత్రంలో ఉడకబెట్టిన గుడ్లను తింటారట. గుడ్లను ఉండికించడానికి.. 10 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల నుంచి మూత్రం సేకరించేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ మూత్రంలో ఉడకబెట్టిన గుడ్లతో అక్కడివారు ప్రత్యేక వంటకం చేస్తారు. ఆ వంటనానికి Virgin boy egg డిష్ అని పిలుస్తారు. ఇది ఆ ప్రాంతంలో సంప్రదాయ వంటకంగా ఉంది. దీనిని అక్కడి ప్రజలు తెగఇష్టంగా తింటారు.

మూత్రం ఎలా సేకరిస్తారంటే..

అయితే గుడ్లను ఉడికించడానికి అవసరమైన మూత్రం సేకరించడానికి.. అక్కడ ఫుడ్ స్టాల్ యజమానులు.. స్కూల్స్‌లో బకెట్లను ఉంచుతారు. 10 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను వాటిలో టాయిలెట్ కి వెళ్లాల్సిందిగా చెప్తారు. ఆ విధంగా సేకరించిన మూత్రాన్ని గుడ్లు ఉడికించడానికి వాడతారు.

వంట ఎలా చేస్తారంటే..

వర్జిన్ బాయ్ ఎగ్ డిష్ తయారు చేయడానికి దాదాపు ఒక పూర్తి రోజు సమయం పడుతుందట. మొదటగా గుడ్లను ఆరు నుంచి ఏడు గంటల పాటు మూత్రంలో ఉంచుతారు. మూత్రంలో గుడ్లను ఉడకబెట్టిన తర్వాత.. పై భాగం వలిచేసి అనంతరం వాటితో డిష్‌ను ప్రిపేర్ చేస్తారు.

ఇంతకి కారణమేంటంటే..

అక్కడి ప్రజలు చాలా కాలంగా మూత్రంలో ఉడికించిన గుడ్లను తింటున్నారు. అది వారి సంస్కృతిలో భాగంగా మారిపోయింది. ఈ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా వేడి దెబ్బ తాకదని అక్కడి వారు నమ్ముతున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని వారు విశ్వాసం.

తింటే ఉపయోగాలేంటటే..

యూరిన్ థెరపీ అనేది చైనీయులు సాంప్రదాయ వైద్యంలో భాగం. ప్రాచీనకాలంలో మూత్రాన్ని మెడిసన్ గా ఉపయోగించేవారు. నేడు మూత్రం అనేది ఒక దుర్వాసన సంకేతంలా మారిపోయింది. మూత్రం పోసినప్పుడు కొద్ది సేపటికి ఆరిపోతుంది. అనంతరం ఇది స్పటికీకరిస్తుంది. మూత్రాన్ని వాపు, చర్మం మరియు నోటి ఫంగల్ ఇన్ ఫెక్షన్ లు తగ్గడానికి కూడా ఉపయోగిస్తారు.

మూత్రంలో నానబెట్టిన గుడ్లను తినటం వల్ల బాడీ వేడిని తగ్గించటంతో పాటు రక్తప్రసరణ సరిగా జరిగేలా చూస్తుంది. ప్రాచీన కాలంలో గుడ్లు ఒకరి సొంత మూత్రంలో ఏడు రోజులుపాటు ఉంచి..వాటిని మూడు నెలలపాటు తింటే దీర్ఘకాలిక ఆస్తమాను నివారించవచ్చని చైనీయులు నమ్ముతారు. చిన్నపిల్లవాడి మూత్రం చాలా శక్తివంతమైనదిగా చైనీయులు భావిస్తారు. ఈ మూత్రాన్ని మూలికలతో కలపి టానిక్ కూడా తయారు చేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version