మూడు రోజులపాటు వాల్టర్ రీడ్ మిలటరీ మెడికల్ సెంటర్‌లో చికిత్స తీసుకుని కోలుకున్న అమెరికా అధ్యక్షుడు సోమవారం ఉదయం వైట్ హౌస్ చేరుకున్నారు..పూర్తి స్థాయిలో కరోనా నుంచి కోలుకోకుండానే అస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు..ఆస్పత్రి నుంచి వైట్ హౌస్ చేరుకున్న ట్రంప్ రెండు చేతులు జేబులో పెట్టుకుని నడచుకుంటూ శ్వేతసౌధంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆస్పత్రి నుంచి వైట్ హౌస్‌కు వెళ్లే సమయంలో ట్రంప్ పూర్తి విశ్వాసంతో కనిపించారు. అదే సమయంలో కరోనాపై విజయానికి గుర్తుగా రెండు బొటన వేలు చూపించారు. బయటకు రాగానే ట్రంప్ మాస్క్ పక్కకు పడేశారు.
ఇవాళ ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతానని ట్వీట్టర్‌లో ప్రకటించిన ట్రంప్.. అనుకున్న విధంగానే ఆస్పత్రి నుంచి శ్వేతసౌధానికి చేరుకున్నారు. వచ్చి రాగానే ఎగ్జిక్యూటివ్ భవనం వద్దకు వెళుతుండగా విలేకరులపై విరుచుకుపడ్డాడు…వైట్ హౌస్ లో ఎంత మందికి కరోనా వ్యాధి సోకింది అనే విలేకరి ప్రశ్నకు ఆగ్రహం వ్యక్తం చేశారు…తరువాత అతను వైట్ హౌస్ సౌత్ పోర్టికో యొక్క మెట్ల పైకి నడిచి, తన మాస్క్‌ను తీసివేసి, ఫోటోలకు పోజులిచ్చాడు…అయితే ట్రంప్ శికిత్స పొందుతున్న సమయంలో బయటకు రావడంపై ఆస్పత్రి వైద్యులు కొంత ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు..అదే విధంగా వైట్ హౌస్ వద్ద ప్రపంచ స్థాయి వైద్య సంరక్షణ ఉంటుందని చెప్పారు..అనారోగ్యం సమయంలో ట్రంప్ కొన్ని ప్రారంభచికిత్సలను అందుకున్నందున వైద్యులు “పర్యవవేక్షన ఉంటుందని” ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఆస్పత్రి నుంచి ట్రంప్ డిశ్చార్..పూర్తిగా కోలుకోకుండానే వైట్ హౌస్‌లోకి ఎంట్రీ..!
-