దీపావళికి ఇంటిని అందంగా మార్చాలనుకుంటున్నారా..? అయితే ఇవి బెస్ట్ ఐడియాస్..!

-

దీపావళి పండుగ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. పిల్లలు మొదలు పెద్దల వరకు దీపావళి పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. దీపావళి అంటే అందరికీ మొదట గుర్తొచ్చేది దీపాలు. ఇంటిని చక్కగా దీపాలతో అలంకరిస్తుంటారు. నిజానికి దీపావళి పండుగ కి డెకరేషన్ చేయడం అంత ఈజీ కాదు. పైగా ఇంటిని అందంగా మార్చుకోవాలని ప్రతి ఒక్కరూ తాపత్రయపడుతుంటారు.

 

వివిధ రకాల థీమ్స్ ని ఆలోచిస్తూ ఉండరు. మీరు కూడా మీ ఇల్లు ని అందంగా మార్చుకోవాలనుకుంటున్నారా..? దీపావళి పండుగకి చక్కటి కి డిజైన్స్ తో, థీమ్స్ తో ఇంటిని అందంగా మార్చేయచ్చు. మీ ఇంటిని అందంగా మార్చుకోవడం కోసం ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి కనుక ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీ ఇల్లు ఎంతో అందంగా మారిపోతుంది పైగా ఇలా అలంకరిస్తే ఎవరైనా ఫిదా అవుతారు.

మీ ఇంటికి వచ్చిన గెస్ట్లు కూడా ఆశ్చర్యపోతారు. అంత అద్భుతంగా ఉన్నాయి థీమ్స్. మరి వాటికోసమే ఇప్పుడు చూద్దాం. పెద్ద బడ్జెట్ అవసరం లేదు తక్కువ బడ్జెట్ తో ఎంతో అందంగా మీ ఇంటికి అలంకరణ చేసుకోవచ్చు.

లైట్ల తో డెకరేట్ చేసేయండి:

ఇంటిని అందంగా మార్చడానికి లైట్లు సరిపోతాయి. అందమైన లైట్లను మీరు ఎంపిక చేసుకుని డెకరేట్ చేశారంటే ఇంక డెకరేషన్ లో ఎటువంటి తిరుగు ఉండదు. ఇంటికి కళ వస్తుంది. చక్కగా మీరు కలర్స్ ని చూసుకుని ఇంట్లో ప్రదేశాన్ని చూసుకుని డెకరేట్ చేసేయండి.

మంచి సుగంధాలు:

మీరు కావాలంటే మంచి సెంటెడ్ క్యాండిల్స్ ని వెలిగించవచ్చు దీనివల్ల ఎంతో ప్రశాంతంగా ఉంటుంది పైగా డెకరేషన్ అందంగా కూడా ఉంటుంది. లేదంటే మీరు సాంబ్రాణి, సుగంధ తైలాలు లేదా కర్పూరం వంటి వాటిని ఉపయోగించవచ్చు.

అందమైన కర్టైన్స్:

రంగురంగుల డోర్ కర్టెన్స్ ని కడితే కూడా చాలా బాగుంటుంది. అలానే నాన్ టాక్సిన్ మెటీరియల్స్ తో గోడల మీద పెయింటింగ్ చేయొచ్చు.

దీపాల థీమ్:

చక్కగా మీరు దీపాలు వంటి థీమ్ ని ఉపయోగించి మీ ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చు. అలానే లాంప్స్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి. వాటిని కూడా మీరు తక్కువ డబ్బులతో కొనుగోలు చేయవచ్చు. ఇలా అందంగా మీరు మీ ఇంటిని దీపావళికి డెకరేట్ చేసి అతిథులని ఫిదా చేయొచ్చు. పైగా అందమైన ఫోటోలను కూడా మీరు క్లిక్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news