నవరాత్రులు: అమ్మవారి అలంకారాలు,నైవెద్యాలు..

-

ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రులకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల ఐదో తేదీ వరకూ శరన్నవరాత్రులు నిర్వహిస్తారు..ఈ తొమ్మిదిరోజులపాటు అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో రెడీ చేస్తారు.అలాగే అమ్మవారికి కట్టే చీర రంగు కూడా ఒక్కోరోజు ఒక్కోలా ఉంటుంది. ఆభరణాలను కూడా ప్రత్యేకంగా అలంకరిస్తారు.

*.ఈ శరన్నవరాత్రులు సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక నైవైద్యాన్ని సమర్పిస్తారు. 26వ తేదీన స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. బంగారు రంగు చీర అమ్మవారికి కడతారు. నైవైద్యంగా కట్టె పొంగలి, చలిమిడి, వడపప్పు, పాయసాన్ని సమర్పిస్తారు.

*. 27న మంగళవారం నాడు బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దుర్గాదేవి దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి లేత గులాబీ రంగు చీరను కడతారు. ఇక నైవైద్యంగా పులిహోరను పెడతారు.

*.28వ తేదీ బుధవారం దుర్గాదేవి గాయత్రీ దేవి అలంకారంలో కన్పించనున్నారు. కాషాయం లేదా నారింజ రంగు చీరను అమ్మవారికి కడతారు. కొబ్బరి అన్నం, కొబ్బరి పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు.
*. 29వ తేదీ గురు వారం అన్నపూర్ణాదేవి అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తారు. గంధపు రంగు లేక పసుపు రంగు చీరతో అమ్మవారు కనిపిస్తారు. ఈరోజు క్షీరాన్నం, దద్దోజనం, గారెలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.
*. ఈ నెల 30వ తేదీ శుక్రవారం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తారు. కుంకుమ రంగు చీరను అమ్మవారికి కడతారు. నైవేద్యంగా దద్దోజనం, క్షీరాన్నం పెడతారు.
*.అక్టోబరు 1వ తేదీన విజయవాడ దుర్గమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో కనిపిస్తారు. ఈరోజు గులాబీరంగు చీరలో అమ్మవారు కనిపిస్తారు. చక్కెర పొంగలి, క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.
*.అక్టోబరు 2వ తేదీన దుర్గాదేవి శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో కనిపిస్తారు. మూల నక్షత్రం ఎంతో విశిష్టత ఉండటంతో ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. తెలుపు రంగు చీరతో అమ్మవారు ఈరోజు దర్శనమిస్తారు. ఈరోజు కేసరి, పరమాన్నం, దద్దోజనం నైవేద్యంగా సమర్పిస్తారు.
*.అక్టోబరు 3వ తేదీన కనకదుర్గ తల్లి దుర్గాదేవి అలంకారంలో కన్పిస్తారు. ఈరోజు ఎరుపు రంగు చీరను అమ్మవారికి కడతారు. నైవేద్యంగా కదంబం, శాకాన్నం పెడతారు.
*. అక్బోబరు 4వ తేదీన అమ్మవారు శ్రీ మహిషాసుర మర్ధిని దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు ముదురు ఎరుపు రంగు చీర తో దుర్గమ్మ తల్లి దర్శనిమిస్తుంది. చక్కెర పొంగలిని నైవేద్యంగా పెడతారు.
*. అక్టోబరు 5వ తేదీన దుర్గాదేవి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో కన్పిస్తారు. ఈరోజున ఆకుపచ్చ రంగు చీరలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. పులిహోర, లడ్డూలు, బూరెలు, గారెలు, అన్నం నైవేద్యంగా పెడతారు.

Read more RELATED
Recommended to you

Latest news