ఇండిగో ఎయిర్లైన్స్ అయోధ్య నుండి అహ్మదాబాద్ కి వాణిజ్య విమాన సర్వీస్ ని స్టార్ట్ చేసింది. విమానయాన కొత్త మార్గాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతి ఆదిత్య సింధ్య ఉత్తర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేయడం జరిగింది. జనవరి 22న రామ మందిర ప్రతిష్టాపన వేడుకకి ముందు ఇండిగోకి తీసుకు వచ్చిన రెండో విమాన సర్వీసు. ఢిల్లీ అయోధ్య రూట్ సర్వీస్ ఇప్పటికే మొదలైపోయింది. జనవరి 15 నుండి ముంబై అయోధ్య మార్గంలో విమానాన్ని స్టార్ట్ చేయబోతున్నారు.
ఇండిగో అహ్మదాబాద్ అయోధ్య రూట్ విమానాలు వారానికి మూడు రోజులు ఉంటాయి ప్రతివారం మంగళవారం, గురువారం, శనివారం నాడు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం అహ్మదాబాద్ నుండి ఉదయం 9:10 గంటలకి విమానం స్టార్ట్ అవుతుంది. ఈ విమానం అయోధ్యకు చేరుకునే సమయం ఉదయం 11:00. అలానే అయోధ్యలో ఉదయం 11:30 గంటలకి బయలుదేరి మధ్యాహ్నం 01: 40 కి అహ్మదాబాద్ చేరుకుంటుంది. మనం జనవరి 13 శనివారం అయోధ్య నుండి అహ్మదాబాద్ మార్గానికి విమానం ధర వచ్చేసి రూ.4,276.