డయాబెటిస్ నుండి కంటి సమస్యలను దూరం చేసే ఉసిరి ప్రయోజనాలు..

-

భారతదేశ ఆయుర్వేద శాస్త్రంలో ఉసిరి ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఆయుర్వేదంలో ఉసిరి వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. మన వాళ్ళు చాలా మంది ఉసిరిని తమ ఆహారంలో భాగం చేసుకుంటారు. సిట్రస్ ఫలమైన ఉసిరిలో సి విటమిన్ అధికంగా ఉంటుంది. అందువల్ల శరీరానికి చాలా మేలు కలుగుతుంది. కంటికి సంబంధించిన సమస్యల నుండి డయాబెటిస్, రాళ్ళు మొదలగు అన్నింటినీ దూరం చేసే ఉసిరి ప్రయోజనాలు ఈ రోజు తెలుసుకుందాం.

కళ్ళు

కంటిచూపును మెరుగుపరచడానికి ఉసిరి బాగా సహకరిస్తుంది. కంటి శుక్లాలను తొలగించడంలో దీని పాత్ర అమోఘం. దీనికోసం ఉసిరి పొడిని తేనెతో కలుపుకుని తాగడం ప్రారంభించండి. కొద్ది రోజుల్లో మంచి లాభాలు పొందుతారు.

డయాబెటిస్

చక్కెర వ్యాధులు ఇప్పుడు కామన్ గా మారిపోయాయి. ప్రతీ యేటా డయాబెటిస్ వ్యాధిన బారిన పడ్డవారు విపరీతంగా పెరుగుతున్నారు. ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి ఉసిరి రసాన్ని తేనెలో కలుపుకుని తాగితే బాగుంటుంది. ఇలా ప్రతి రోజూ చేయాలి.

ఆసిడిటీ

ఈ ఇబ్బందితో బాధపడుతున్నవారు ఉసిరి, చక్కెర కలుపుకుని తిన్నా సరిపోతుంది. లేదంటే నీటిలో కలుపుకుని తాగినా మంచిదే. ఇంకా ఉసిరి కాయ జ్యూస్ తాగితే కడుపుకి సంబంధించిన సమస్యలన్నీ దూరమవుతాయి. ఏదైనా తిందామని అనుకున్నప్పుడు అసిడిటీ ఉందని గుర్తొచ్చి అది తినలేకపోయిన వారు ఉసిరిని తల్చుకోండి. ఐతే ఇన్ని ప్రయోజనాలున్నప్పటికీ చాలా మందికి ఉసిరి విలువ తెలియదు. పండగ సమయంలో దేవుని ముందు ఉసిరిలో దీపం పెట్టడం మాత్రమే తెలుసు. దేవుడి దీపం దానిలో పెడుతున్నామంటే అదెంత ప్రయోజనకారి అయ్యుంటుందనేది గమనిస్తే బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news