ఆర్డర్ చేసిన 30 ఏళ్లకు డెలివరీ.. ఆ ఫుడ్ ప్రత్యేకత ఇదే..

-

ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఎంత సమయం పడుతుంది..అర గంటకో,గంటకో వస్తుంది..ఓ ఐటమ్ ను ఆర్డర్ పెట్టుకుంటే మాత్రం డెలివరీకి 30 ఏళ్లు పడుతుంది.. ఏంటి ముప్పైళ్ళా.. ఆర్డర్ చేసిన వాళ్ళు ఆ లోపు పోతే.. ఇలా రకరకాల ప్రశ్నలు రావడం సహజం. ఇంతకీ ఆ వంటకం ఏంటీ.. అసలు దానికెందుకంత సమయం పడుతుంది వంటి విషయాలలోకి వెళితే..

జపాన్ లో ఓ ప్రత్యేక వంటకం తయారు చేస్తారు. ఆ వంటకం పేరు క్రోక్విట్స్. చూడడానికి ఆలూ కట్లెట్ ఆకారంలో కనిపించే ఈ క్రోక్విట్స్ చాలా పాత వంటకం అంట. జపాన్ లో ‘ఆషియా’ అనే ఫ్యామిలీ మాత్రమే ఈ వంటకాన్ని గత 96సంవత్సరాలుగా తయారుచేస్తోందట..
ఇది నాన్ వెజ్ తో తయారు చేస్తారు.ప్రపంచంలో కేవలం జపాన్ లో ఆషియా కుటుంబం మాత్రమే వీటిని తయారు చేస్తుంది. ప్రస్తుతం వీరి కుటుంబంలో షిగేరు నిట్టా అనే వ్యక్తి ఈ వంటకాన్ని తయారు చేస్తున్నాడు. ఇతడు వీరి కుటుంబంలో మూడవ తరం వాడు. ఈ వంటకం తయారు చేయడానికి స్థానికంగా వారు పండించే బంగాళాదుంపలు, జపాన్ కు చెందిన మూడు సంవత్సరాల వయసు గల నల్లజాతి పశువుల గొడ్డు మాంసాన్ని ఉపయోగిస్తారట. ఇవి వారంలో కేవలం రెండువందలు మాత్రమే తయారు చేస్తారట. అందువల్ల ఇవి ఎక్కువగా పంపిణీ చేయలేకపోతున్నారు.

జపాన్ కు చెందిన నల్లజాతి పశువులను కోబ్ అని పిలుస్తారు. ఇవి భారతీయ గేదెలను పోలి ఉంటాయి. 1996 సంవత్సరంలో మొట్టమొదటిసారి ఈ క్రోక్విట్స్ ను అమ్మడానికి ఆన్లైన్ స్టోర్ ను ఓపెన్ చేశారు. అప్పటి నుండి వీటిని ఆర్డర్ చేసుకోవడం మొదలు పెట్టారు చాలామంది. అన్ని సంవత్సరాల తరువాత నిజంగానే డెలివరీ ఇస్తారా అనే అనుమానం చాలా మందికి వస్తుంది. 2013 సంవత్సరంలో ఓ మహిళ ఈ డిష్ ను ఆర్డర్ చేయగా తాజాగా ఆమెకు డెలివరీ ఇచ్చినట్టు పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇంత ప్రత్యేకత ఉన్న ఆ వంట ఖరీదు కేవలం రూ.1600 మాత్రమే..ఇందులో అయిదు కట్లెట్ లాంటి పీస్ లు ఉంటాయి. ఓ ఖరీదైన రెస్టారెంట్ కు వెళితే అయ్యే ఖర్చు కంటే తక్కువే.. మొదట్లో దీని గురించి ఎవరికీ సరిగా తెలియదు కానీ 2000 సంవత్సరంలో ఈ క్రోక్విట్స్ గురించి ఓ న్యూస్ పేపర్ ప్రచురించడంతో ప్రపంచ వ్యాప్తంగా దీని గురించి తెలిసింది. ఓపిక ఉన్న మాంసాహార ప్రియులు ఆసక్తి ఉంటే ఓ లుక్కేయండి…అయితే 30 ఏళ్ళు తప్పక ఆగాల్సిందే..

Read more RELATED
Recommended to you

Latest news