ఈ వేసవిలో చలువ చేసే ధాన్యాలు.. తింటే ఎన్నో లాభాలు..!!

-

ధాన్యాలు: మనం 365 రోజులు ఒకటే రకమైన డైట్‌ ఫాలో అవుతా అంటే కుదరదు.. సీజన్‌ బట్టి.. తినేవి కూడా మార్చాల్సి ఉంటుంది. అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది. సమ్మర్‌లో శరీరానికి వాటర్‌ ఎక్కువగా కావాలి. అలా అని వాటర్‌ మాత్రమే తాగితే.. విరోచనాలు అయితాయి.. బాడీ డీహైడ్రేట్‌ అవకుండా తినాల్సి ఉంటుంది. కొన్ని ధాన్యాలు తీసుకుంటే.. శరీరానికి చలువ చేస్తుంది. అవేంటో చూద్దామా..!

 

వేసవి వేడి వల్ల శరీరం తొందరగా డీ హైడ్రేట్ అవ్వడం, నీరసంగా కూడా అనిపిస్తుంది. కాలాన్ని బట్టి మీ ఆకలి తీరు మారుతుంది. తినాలనిపించే కోరికలు మారతాయి. కొన్ని రకాల ధాన్యాలు, చిరుధాన్యాలు ఆరోగ్యానికి చాలా మంచివి. సలాడ్లు, పులావ్, దోసెలు.. ఇలా చాలా వంటకాల్లో వాటిని వాడొచ్చు.

బార్లీ:
పోషకాలు ఎక్కువగా ఉన్న బార్లీ వేసవిలో మంచి ఆహారం. వేడి వల్ల శరీరం కోల్పోయిన అనేక పోషకాలు బార్లీలో ఉంటాయి.. ఇది మూత్ర నాళ ఇన్ఫెక్షన్లు రాకుండా కూడా తోడ్పడుతుంది. బార్లీని సూప్స్, బ్రెడ్ తయారీలో కూడా వాడొచ్చు.
నానబెట్టాల్సిన సమయం : కనీసం 4 గంటలు, వంటకాలు: పులావ్, సలాడ్లు, రోటీలు చేయడానికి వాడొచ్చు.

రాగులు
రాగుల్లో.. పీచు శాతం, క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. మధుమేహంతో బాధపడుతున్న వాళ్లకి ఇదొక మంచి ఆహారం. చిన్న పిల్లలకి రాగితో చేసిన జావ తినిపించడం వల్ల త్వరగా జీర్ణమవుతుంది. బరువు తగ్గడంలో, వేసవిలో చలువ చేసేలా చేస్తుంది.
నానబెట్టాల్సిన సమయం : 8 గంటలు, వంటకాలు: దోశలు, జావ, రోటీలు చేయడంలో వాడొచ్చు.

సామలు:
సామలలో ప్రొటీన్, క్యాల్షియం, ఇనుము, మినరళ్లు, విటమిన్ బి.. ఎక్కువగా ఉంటాయి. ఇందులో గ్లుటెన్ ఉండదు. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్‌తో బాధ పడుతున్న వాళ్లకి, గుండె సంబంధిత వ్యాధులున్న వారికి ఇవి బాగా మేలు చేస్తుంది.
నానబెట్టాల్సిన సమయం : 8 గంటలువంటకాలు: దోశెలు, పులావ్, కిచిడీ చేయడంలో ఉపయోగించొచ్చు.

జొన్నలు- మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంలో జొన్నలు చాలా బాగా పనిచేస్తాయి.. ఇందులో విటమిన్ B1, ఇనుము, పీచు అధికంగా ఉంటాయి.
నానబెట్టాల్సిన సమయం : 10 గంటలు, వంటకాలు: కిచిడీ లేదా రొట్టెలు చేయడానికి వాడొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version