కిడ్నీలు ఆరోగ్యాంగా ఉండాలంటే.. వీటిని తప్పక తీసుకోండి..!

-

చాలామంది ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అనారోగ్య సమస్యలు కలగకుండా ఉండాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. కిడ్నీలు దెబ్బ తినడం వలన చాలామంది సఫర్ అవుతున్నారు. కిడ్నీలు హెల్తీగా ఉండాలంటే మాత్రం వీటిని ఫాలో అవ్వండి. క్రాన్ బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి వీటిని తీసుకోవడం వలన కిడ్నీలు హెల్తీగా ఉంటాయి. క్రాన్ బెర్రీస్ తో జ్యూస్ చేసుకుని తీసుకోవడం వలన కిడ్నీలు హెల్తీగా ఉంటాయి. ఆపిల్స్ ని కూడా తీసుకోవచ్చు. ఇందులో పొటాషియం తక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఆపిల్స్ లో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు కూడా ఉంటాయి.

ఆపిల్స్ ని తినడం వలన కిడ్నీలు హెల్తీగా ఉంటాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజు ఒక గుడ్డును కూడా తీసుకోండి గుడ్డు తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ప్రోటీన్, ఫాస్ఫరస్ కూడా లభిస్తుంది. అలాగే చికెన్ లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. తక్కువ ఫాస్ఫరస్, సోడియం ఉండే చికెన్ తీసుకోవడం వలన కిడ్నీ సమస్యలు రావు. కాలీఫ్లవర్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఆరోగ్యంగా ఉంచి కిడ్నీల సమస్యలను తగ్గిస్తాయి.

బెల్ పెప్పర్స్ ని కూడా తీసుకోండి. ఇందులో పొటాషియం ఎక్కువ ఉంటుంది. విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది కిడ్నీ సమస్యలు రాకుండా చూస్తుంది. అలాగే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే పైనాపిల్ కూడా తీసుకోండి ఇందులో ఉండే పోషకాలు కిడ్నీలని ఆరోగ్యంగా ఉంచుతాయి. సాల్మన్ వంటి ఫ్యాటీ ఫిషెస్ ని కూడా తీసుకోండి. ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కిడ్నీలను హెల్తీగా ఉంచుతాయి. ఎక్కువ నీళ్లు తీసుకోవడం కూడా ముఖ్యం. ఇలా వీటిని మీరు ఫాలో అయినట్లయితే కిడ్నీలు హెల్తీగా ఉంటాయి. కిడ్నీ సమస్యలు రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version