చాలామంది పెసరపప్పు పెసలు తింటే ఆరోగ్యం పాడుతుందని భావిస్తారు. అందుకనే చాలామంది ఇళ్లల్లో వీటిని వండరు కూడా. అయితే నిజంగా పెసరపప్పు తింటే ఆరోగ్యం పాడవుతుందా? ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు వస్తాయి..? నిజానికి పప్పులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది పెసరపప్పులో కూడా సమృద్ధిగా ప్రోటీన్ ఉంటుంది. కాపర్, ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్ మొదలైనవి దీనిలో ఉంటాయి అయితే కొంతమంది పెసరపప్పు తింటే కొన్ని రకాల సమస్యలు వస్తాయి అని భావిస్తారు. చాలామందిలో ఉండే ప్రశ్న అయితే ఏమైనా హాని కలుగుతుందా పెసరపప్పు వల్ల ఇబ్బందులు వస్తాయి అని.. పెసలు, పెసరపప్పులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది రోగనిరోధక శక్తిని కూడా పెసరపప్పు తీసుకొని పెంచచ్చు.
ప్రోటీన్ ఉండడం వలన బరువు తగ్గడానికి అవుతుంది. ఫైబర్ కూడా ఎక్కువ అందుతుంది కాబట్టి ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. మనం పెసరపప్పుతో హల్వా కిచిడి వంటివి తయారు చేసుకోవచ్చు. పెసరపప్పును తీసుకుంటే గ్లూకోజ్ ఒంట్లో పెరుగుతుంది డయాబెటిస్ తో బాధపడే వాళ్ళకి పెసలు పెసరపప్పు మంచిదే. అయితే ఏదైనా కూడా లిమిట్ గానే తీసుకోవాలి. దేనినైనా అతిగా తీసుకుంటే కచ్చితంగా సమస్యలు ఉంటాయి.
లిమిట్ గా తీసుకునే వరకు ఏ ఆహార పదార్థం వల్ల ప్రమాదం ఉండదు. ఇందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా అతిగా తీసుకుంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ కలగొచ్చు. కానీ తక్కువ మోతాదులో తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యలు కూడా అతిగా తీసుకోవడం వలన కలుగుతాయి. పచ్చి పెసరపప్పు తీసుకుంటే ఈ ఇబ్బందులు వస్తాయి. యూరిక్ ఆసిడ్ ఉన్నవాళ్లకి కాస్త ప్రమాదం కలగొచ్చు ఎక్కువగా పెసరపప్పు తీసుకుంటే డయేరియా కూడా రావచ్చు.