కూరగాయల మార్కెట్ కి వెళ్తున్నారా? బంగాళదుంప గురించి ఇవి తెలుసుకోండి..

-

వారం వారం కూరగాయల మార్కెట్ కి వెళ్ళడం అందరికీ అలవాటే. ఈ అలవాటు ఆడవాళ్ళకే ఎక్కువగా ఉంటుందనడంలో సందేహం లేదు. మగవాళ్ళు జాబ్ చేయడానికి, ఆడవాళ్ళు ఇల్లు చూసుకోవడానికి అని భావిస్తున్నారు కాబట్టి కూరగాయలు కొనడం ఆడవాళ్ళ పనే అని అనుకుంటున్నారు. కాబట్టి చాలా మంది మగాళ్ళకి కూరగాయలు ఎలా కొనాలో కూడా తెలియదు. కనీసం కూరగాయల మార్కెట్ వైపు కన్నెత్తి చూడడానికి కూడా ఇష్టపడరు. ఇలాంటి వారు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలని ఇక్కడ చూద్దాం.

మార్కెట్లో రకరకాల ధరల్లో రకరకాల కూరగాయలు కనిపిస్తాయి. కొన్నింటిని చూడగానే కొనాలనిపించేంత బాగుంటాయి. కొన్నేమో అస్సలు కొనబుద్దవదు. ఐతే మార్కెట్లో బాగా కనిపించే కూరగాయల్లో బంగాళదుంప ఒకటి. అది ఏ సీజన్ అయినా బంగాళదుంప మార్కెట్లో ఖచ్చితంగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధికంగా పండించే పంటగా బంగాళదుంప రికార్డుకెక్కింది కాబట్టి ఏ సీజన్లో అయినా దర్శనమిస్తుంది.

బంగాళదుంపలని ఎంచుకోవడానికి ఓ పద్దతుందని చాలా మందికి తెలియదు. భూమిలోపల దొరుకుతాయి కాబట్టి వాటిని ఏ విధంగా ఎంచుకోవాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి. మొదటగా, బంగాళదుంపకి ఇగురు వచ్చినట్టు కనిపిస్తే పక్కన పెట్టేయండి. దాని పైన మొలకల్లాంటి కనిపిస్తే వాటిని తీసుకోకూడదు. మృదువుగా ఉండే బంగాళదుంపలని ఎంచుకోవద్దు. టైట్ గా ఉండే గట్టివాటినే తీసుకోవాలి. అలాగే బంగాళదుంపపై ఆకుపచ్చ రంగులో మచ్చలు ఉంటే అస్సలు ముట్టవద్దు.

బంగాళదుంపలని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత శుభ్రం చేయాలన్న ఉద్దేశ్యంతో కడిగేసి అలాగే ఉంచవద్దు. మీరు వండుదామని అనుకున్నప్పుడే కడగాలి. కడిగేసి అలానే ఎక్కువసేపు ఉంచితే బంగాళదుంప తొందరగా పాడవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news