బంగాళదుంప, క్యాబేజీ, మాంసం.. వీటిని ఇలా వండకండి..!

-

కొన్ని రకాల కూరగాయలను ఉండే విషయంలో ప్రతి గృహిణి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని కాయగూరలు కట్ చేసినట్లు కొన్ని కట్ చేయకూడదు. అలాగే అన్నింటిని ఉడకపెట్టినట్లు ఉడకపెట్టొద్దు..మరి అలాంటివి ఏంటో, ఏం చేయకూడదో ఈరోజు తెలుసుకుందాం.!

ఆలూ

బంగాళాదుంపల్ని ఉడికించి కూర చేయటం చాలా మందికి అలవాటు. త్వరగా ఉడకాలని..దుంపలను చిన్న ముక్కలుగా కోసి ఉడికిస్తారు. అసలు అలా చేయకూడదు అంటున్నారు నిపుణులు.. అలా చేస్తే వాటిలోని పోషక విలువలు పోతాయి. అందుకే బంగాళాదుంపల్ని బాగా కడిగి మధ్యలో చిన్నగా కోసి పొట్టుతో ఉడికించాలి. అలా చేయడం వల్ల దుంపల పొట్టులో ఉండే పీచు పోదు. ఇతర పోషకాలూ అందుతాయి.

క్యాబేజీ..

చాలామంది క్యాబేజీని ఉడికించి కూర చేస్తారు. ఇలా ఉడికించినప్పుడు అందులో శరీరానికి మేలు చేసే గుణాలన్నీ వృథాగా పోతాయి. అందుకే దీన్ని ఉడికించేటప్పుడు నీళ్లలో నూనె లేదా కాస్త వెన్న వేయండి. అప్పుడే పోషకాలు పోవు. క్యాబేజీని అతిగా ఉడికించినా, వేయించినా సల్ఫర్‌ విడుదలై దాని రుచి మారే ప్రమాదముంటుంది. కాబట్టి ఎక్కువ సేపు ఉడికించవద్దు. క్యాబేజీలో ఉండే పురుగులు పోవడానికి మాత్రమే ఉడికిస్తున్నాం..అంతేకానీ.అది మెత్తగా అయ్యేవరకూ ఉడికించాల్సిన అవసరం లేదు.

ఉల్లిపాయలు..

సలాడ్లు, బర్గర్లు, శాండ్‌విచ్, బిర్యానీల్లో‌ వంటి వాటిల్లో పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేస్తుంటాం. నిజానికి ఇది మంచి పద్ధతి. పచ్చి ఉల్లిపాయల్లో సల్ఫర్‌ ఉంటుంది. ఇది జీవక్రియ రేటును పెంచుతుంది.

మాంసం-చేపలు..

ఆదివారం వస్తే..వండుకునే మాంసం చేపలను..ఎక్కువ మంట మీద ఉడికిస్తే అందులో ఉండే మాంసకృత్తులు నశించిపోతాయి. ఆరోగ్యానికి హాని చేసే కార్సినోజెనిక్ కాంపౌండ్లు, హెటిటరోసైకిల్‌ అమైన్స్‌ విడుదలవుతాయి. అందుకే తక్కువ మంట మీద ఉడికించాలి.
చాలామంది తెలియక ఈ తప్పులు చేసే ఉంటారు..కాబట్టి ఇక నుంచి బంగాళుదుంపలను, క్యాబేజీని ఉడికించే విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా పచ్చి ఉల్లిపాయ తినే అలవాటు ఎక్కువగా ఉన్నా కాస్త తగ్గించండి..ముఖ్యంగా నైట్ టైంలో చపాతీలోకి పచ్చిఉల్లిపాయను తింటుంటారు. దాని వల్ల నోరు విపరీతమైన దుర్వాసన వస్తుంది.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news