వండిన ఆహారాలు కలుషితం కాకుండా ఉండడానికి ఆహార భద్రత సంస్థ చెప్పిన విషయాలు..

పచ్చి కూరగాయలు మాత్రమే పాడవడానికి ఛాన్స్ ఉందని, వండిన ఆహారాలు కలుషితం కావని అనుకుంటూ ఉంటారు. అందుకే కూరగాయలను సరిగ్గా కడుగుతారు కానీ వండిన ఆహారాలను సురక్షితంగా భద్రపరిచే విషయంలో అంత శ్రద్ధ తీసుకోరు. కానీ మీకిది తెలుసా? వండిన ఆహారాలు కూడా కలుషితం అయ్యే అవకాశం ఉంది. సరైన భద్రత, నిల్వ చేయకపోతే కలుషితం అయ్యి ఫుడ్ పాయిజన్ అయ్యి అనేక వికారాలకు దారి తీయవచ్చని భారతదేశ ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ తెలిపింది.

ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రకారం వండిన ఆహారాల నిల్వ పట్ల జాగ్రత్తగా ఉండాలి. దీనికోసం ఏం చేయాలంటే,

వండిన ఆహారాలను రెండు గంటల లోపు రిఫ్రిజిరేటర్లలో ఉంచాలి. అది కూడా 5డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే.

ఆహారం వండే పాత్రల ఉపరితలాలు కలుషితంగా ఉన్నట్లయితే అందులోని ఆహారం కలుషితం అవుతుంది.

ఆహారం వడ్డించే పరికరాలు శుభ్రంగా లేనపుడు ఇలాంటివి సంభవిస్తాయి.

ఫుడ్ పాయిజన్ వల్ల డయేరియా, డీహైడ్రేషన్, వాంతులు వంటి సమస్యలు వస్తాయి.

ఇలా కాకుండా ఉండడానికి ఏం చేయాలి?

ఆహారం వండే ముందు, తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అందుకే బయట ఆహారాల మీద ఎక్కువగా ఆధారపడవద్దు.

వండిన ఆహారాలపై మూతలు సరిగ్గా ఉండేలా చూసుకోండి.

అహారం వండిన తర్వాత కిచెన్ ఉపరితలాలను శుభ్రంగా కడగాలి.

పచ్చి కూరగాయల వాడకం తగ్గించాలి. వీటి ద్వారానే బాక్టీరియా వంటివి శరీరాన్ని చేరతాయి.

సరిగ్గా వండిన ఆహారాలను మాత్రమే తీసుకోవాలి. మార్కెట్ నుండి తీసుకువచిన కూరగాయల్లో పాలకూర, బ్రకోలీ, కాలీఫ్లవర్ ఉన్నట్లయితే వాటిని శుభ్రంగా కడగాలి. నీటిలో ఉప్పు వేసి శుభ్రం చేస్తే ఇంకా మంచిది.