నెట్టింట ప్రభాస్​ బ్యూటీ హల్​చల్.. ట్రెడిషనల్ ఔట్​ఫిట్​లో క్యూట్ పోజులు

-

మహేశ్ బాబుతో కలిసి వన్ నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్. ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రభాస్​తో కలిసి ఆదిపురుష్​లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ భామ ఆదిపురుష్ ప్రమోషన్స్​లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తరచూ ట్రెడిషనల్ ఔట్​ఫిట్స్​లో సందడి చేస్తోంది. తాజాగా ఈ భా పుల్ లెంగ్త్ అనార్కలీ డ్రెస్సులో కనిపించింది. ఈ ఔట్​ఫిట్​లో కృతి చాలా అందంగా కనిపించింది.

కృతి లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కృతి ట్రెడిషనల్ లుక్​లో చాలా అందంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ బ్యూటీ సీతలా సెట్​ కాదని అనుకున్నాం కానీ.. ఈ ఔట్​ఫిట్​లో చూశాక అర్థమైంది కృతి సీత క్యారెక్టర్​కు పర్ఫెక్ట్ ఫిట్ అని మరికొందరు నెటిజన్లు అంటున్నారు.

సుకుమార్ డైరెక్షన్​లో వచ్చిన వన్ నేనొక్కడినే సినిమాలో మహేశ్ బాబుతో కలిసి టాలీవుడ్​లో అరంగేట్రం చేసింది. కొన్నాళ్ల తర్వాత నాగ చైతన్యతో కలిసి దోచెయ్​ సినిమాలో నటించింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో ఈ బ్యూటీ తెలుగు తెరకు దూరమైంది. ఆ తర్వాత ఈ బ్యూటీ బాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలు దక్కించుకుంటూ అక్కడ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్​గా ఎదిగింది.

Read more RELATED
Recommended to you

Latest news