జీవో నెంబర్ 1ను కొట్టివేత..సుప్రీం కోర్టుకు జగన్ సర్కార్

-

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌ 1ను హైకోర్టు కొట్టేసింది. రహదారులపై రాజకీయ పార్టీలు నిర్వహించే బహిరంగ సభలు, రోడ్‌ షోలను కట్టడి చేసేలా ఏపీ సర్కార్ ఈ ఏడాది జనవరి 2న జీవో నంబర్‌ 1ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. జీవోను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది.

అయితే… ఏపీ హై కోర్టు తీర్పుపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. మంచి ఉద్దేశ్యంతో జీవో వన్ తీసుకుని వచ్చాం.. ప్రజల హక్కులకు భంగం కలుగకూడదనే జీవో వన్ అని తెలిపారు. రోడ్ల పై బహిరంగ సభలు పెట్టి ప్రజల ప్రాణాలు పోవటానికి చంద్రబాబు కారణం అయ్యాడు… ప్రజల ప్రాణాలు కాపాడటం ప్రభుత్వంగా మా బాధ్యత అని వివరించారు. దీనిపై సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళతామని స్పష్టం చేశారు మంత్రి జోగి రమేష్. రోడ్ల పై సభలు పెట్టి తొక్కిసలాట చేయించటం ప్రజాస్వామిక విజయం అవుతుందా?? కోర్టు తీర్పులో ఏముందో పూర్తిగా పూర్తిగా చూడలేదన్నారు. ప్రజా మద్దతు ఉంటే పొత్తుల కోసం వెంపర్లాట ఎందుకు?! అని ఆగ్రహించారు. 2024 ఎన్నికల్లో ప్రజా మద్దతు ఎవరికి ఉందో ప్రజలే నిర్ణయిస్తారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news