ఈ సీజన్‌లో పానీపూరీ తింటే.. టైఫాయిడ్‌కు వెల్కమ్‌ చెప్పినట్లే..!!

-

పానీపూరి అంటే కొంతమందికి నోట్లో నీళ్లు వచ్చేస్తాయ్‌ కూడా అంత ఇష్టం.. ఇంకో బ్యాచ్‌ ఉంటుంది.. వెంటనే యాక్‌ అంటారు. ఇండియాలో ఎక్కడైనా పానీపూరి మాత్రం ఫేమస్‌ స్ట్రీట్‌ ఫుడ్‌గా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. అయితే ఈ సీజన్‌లో పానీపూరీ తినడం వల్ల టైఫాయిడ్‌ వస్తుందని తెలంగాణ ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ సీజన్‌లో ప్రజలు పానీపూరీ తినకపోవడమే మంచిదని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు.
‘టైఫాయిడ్ కేసులన్నీ పానీపూరీ కేసులు. టైఫాయిడ్‌కి మరోపేరు పానీపూరీ డిసీస్ అని చెప్పుకోవచ్చు. రుచి ఎక్కువగా ఉంటుందని జనాలు ఎక్కువగా తింటారు. దీని వల్లే సమస్య వస్తుందని శ్రీనివాస్‌ తెలిపారు. పానీపూరీ నిర్వాహకులు కూడా శుచి శుభద్రత పాటించాలి. ఇందులో కాచివడపోసిన నీటినే వినియోగించాలి. దోమలు, ఈగలు లేకుండా చూడాలి. ఈ టైమ్‌లో పానీపూరీతో పాటు తోపుడుబండ్ల మీద అమ్మే ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
పానీపూరీకి, టైఫాయిడ్‌కు లింక్‌ ఏంటో..
టైఫాయిడ్‌ను గోల్‌గప్పా డిసీజ్ అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి సాల్మొనెల్లా టైఫి అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియా నోటి ద్వారా కడుపులోకి చేరుతుంది. తద్వారా ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తుంది. ఈ బ్యాక్టీరియా వర్షాకాలంలో మరింత చురుకుగా ఉంటుంది. ఎవరైనా టైఫాయిడ్ సోకి వ్యక్తులు పానీపూరీ నీటిని తాగితే.. అది సులభంగా కలుషితమవుతుంది. ఆ నీటిని ఇతరులు తాగితే వారికి కూడా టైఫాయిడ్ వస్తుంది. సరైన సమయంలో చికిత్స చేయకపోతే, ఈ వ్యాధి తీవ్ర రూపం దాల్చుతుంది. అంతర్గత అవయాల్లో రక్తస్రావం జరిగే ప్రమాదముంది. పరిస్థితి విషమిస్తే.. ప్రాణాలు కూడా పోవచ్చు. కాబట్టి..పానీపూరి కోసం ప్రాణాలమీదకు తెచ్చుకోవడం అవసరమా..?
ఈ జాగ్రత్తలు అవసరమే..
ఆహారం తినే ముందు, మలవిసర్జన తర్వాత చేతులను పూర్తిగా శుభ్రం చేసుకోవాలి.
బయట తిరిగి వచ్చిన తర్వాత.. కాళ్లు చేతులను సబ్బుతో కడుక్కోవాలి.
దగ్గినప్పుడు, తుమ్మేటప్పుడు నోటికి అడ్డంగా కర్చీఫ్‌లాంటివి పెట్టుకోవాలి.
మాస్క్‌ పెట్టుకుంటే మరీ మంచిది.
ముఖాన్ని పదే పదే తాకడం మానుకోవాలి.
చల్లటి పదార్థాలను బయట ఎక్కువగా తినకూడదు.
స్ట్రీట్‌ఫుడ్ ఎక్కువగా తినవద్దు. ముఖ్యంగా వీధుల్లో లభించే ద్రవరూప పదార్థాలకు దూరంగా ఉండాలి. అంటే పానీపూరీ లాంటి వాటిని వర్షాకాలంలో తినకపోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news