ఆరోగ్యం మీ చేతుల్లో ఉండాలంటే.. ఈ జ్యూస్‌ డైలీ తాగితే చాలట..!!

-

డబ్బులు సంపాదించడంపైన ఉన్న శ్రద్ధ ఈరోజుల్లో ఆరోగ్యంపై ఎవరికీ లేదు.. ఏదో ఒకటి తినేశామా.. వీకెండ్‌ వస్తే రెస్ట్రారెంట్‌లకు వెళ్లామా చాలు అనుకుంటున్నారు.. అసలు ఎవరు చెప్పారు లైఫ్‌ అంటే శని, ఆదివారం మాత్రమే అని.. అప్పుడే నచ్చింది తినాలి, ఎంజాయ్‌ చేయాలి.. వారం అంతా గొడ్డులా చాకిరి చేయాలని.. కానీ చాలామంది ఈ విషయాన్ని గ్రహించకుండానే ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు. మీకు మీరు హెల్తీగా ఉండేందుకు ఏం ఏం చేస్తున్నారో ఒక పేపర్‌ మీద రాసి చూడండి.. అస్సలు ఏం రావు..

పొద్దున్నే లేచామా ఏదో ఒకటి ఆ తెల్లటి రవ్వతో ఇడ్లీలు వేసుకుని. పోయామా.. మధ్యాహ్నం ఆఫీస్‌లో లంచ్‌.. ఈవినింగ్‌ వస్తూ మూడ్‌ ఉంటే మసాల దోశ.. పనిలేకపోతే పానిపూరి..ఇలా ఏదో ఒకటి తినేసి.. మళ్లీ రాత్రికి అన్నం ఇంతే.. ఆదివారం వస్తే కోడి, మేక, చేప బలి.. ఆరోగ్యం అనేది కోట్లు ఇచ్చినా కొనలేని ఆస్తి.. రోజూ నవ్వుతూ మాట్లాడే నాన్న ఉన్నట్టుండి గుండెపోటుతో చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా..? వీటన్నింటికి కారణం మన దిక్కుమాలిన జీవనశైలి.. అది బాగుంటే వచ్చే నష్టంలో కొంతైనా మెరుగుపరుచుకోవచ్చు.. మనల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచే ఓ అద్భుతమైన జ్యూస్ గురించి ఈరోజు చూద్దాం.. దీనికోసమా ఇంత ఉపోద్ఘాతం చెప్పారు అనుకుంటారేమో..మీరే ఒకసారి ఆలోచించండి.. మనం ఎలా ఉంటున్నామో.. సర్లే ఈ ఆ జ్యూస్‌ సంగతి ఏంటో చూద్దాం..

బీట్‌రూట్, దానిమ్మలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బీట్‌రూట్‌లో బీటా కెరోటిన్, ప్రొటీన్, ఫైబర్, విటమిన్-బి, విటమిన్-సి, ఫాస్పరస్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దానిమ్మలో ఆరోగ్యానికి మేలు చేసే కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు దానిమ్మలో ఉంటాయి. ఈ రెండింటితో జ్యూస్ చేసుకొని తాగితే.. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. దానిమ్మలు కొనగలమా, బీట్‌రూట్‌ తినగలమా అనుకుంటారేమో.. మీరు పెట్టే అనవసరైన ఖర్చులతో పోలీస్తే ఇవి అంత కాస్ట్‌ అయితే కాదు కదా..!రోజు కాకపోయినా వారానికి రెండు మూడు సార్లు అయినా తాగొచ్చు..

ఈ జ్యూస్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో రక్తాన్ని పెంచుతుంది. దీనిని తాగడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్‌ లోపం తీరుతుంది. దానిమ్మ, బీట్‌రూట్ జూస్ నిత్యం తాగడం వల్ల..శరీరంలో రక్తం పెరిగి రక్తహీనత వంటి వ్యాధులు నయమవుతాయి

దానిమ్మ, బీట్‌రూట్.. ఈ రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటి రసం తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. మినరల్స్ పుష్కలంగా ఉండే ఈ జ్యూస్ తాగితే.. హైబీపీ వంటి సమస్యలు మీ దరిచేరవు. బీట్‌రూట్, దానిమ్మతో చేసిన జ్యూస్ గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అనేక గుండె రోగాలు తగ్గిపోతాయి. ఈ జ్యూస్‌లో ఉండే పోషకాలు నరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. మెదడు చురుగ్గా ఉంటుంది.

ఈ జ్యూస్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరచడానికి బాగా పనిచేస్తుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి. గ్యాస్, ఎసిడిటీ సమస్యలు కూడా తగ్గిపోతాయి. బీట్‌రూట్, దానిమ్మ జ్యూస్‌లో శరీరానికి శక్తినిచ్చే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో శక్తి పుంజుకుంటుంది. కడుపు నిండుగా ఉంటుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల అలసట కూడా దూరమవుతుంది.

బీట్‌రూట్, దానిమ్మ జ్యూస్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ జ్యూస్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి లభిస్తాయి. ఇవి చర్మ కణాలను మెరుగుపరచడంలో పని చేస్తాయి. అనేక చర్మ సమస్యలు దూరమవుతాయి. ముఖం మరింత కాంతివంతమవుతుంది. దానిమ్మలు మరీ కాస్ట్‌ ఎక్కువ అనిపిస్తే.. బీట్‌రూట్‌ జ్యూస్‌ అయినా తాగొచ్చు.. ఇవి అయితే మన బడ్జెట్‌లోనే వచ్చేస్తాయి. టైమ్‌ ఎక్కడుంది, ఓపిక లేదు అని మన ఆరోగ్యాన్ని మనమే పాడుచేసుకుంటే ఎలా..?

Read more RELATED
Recommended to you

Latest news