బొప్పాయి పండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాగే బొప్పాయి ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అనారోగ్య సమస్యలను తరిమికొట్టడానికి కలబంద, పుదీనా బాగా పని చేస్తుందని మనకి తెలుసు. అదే విధంగా బొప్పాయి ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తున్నారు. బొప్పాయి ఆకుల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ మరియు బి ఉంటాయి. అలానే ఇందులో కాల్షియం, మెగ్నీషియం. ఐరన్ వంటివి సమృద్ధిగా ఉంటాయి.
బొప్పాయి ఆకులని నేరుగా తినకూడదు కానీ వాటిని జ్యూస్ చేసుకుని తీసుకుంటే చక్కని ప్రయోజనాలను పొందవచ్చు. అయితే బొప్పాయి ఆకుల వల్ల ఎలాంటి ప్రయోజనం పొందవచ్చు ఇప్పుడు మనం చూద్దాం.
డెంగ్యూ జ్వరం తగ్గుతుంది:
డెంగ్యూ సమస్య కనుక వస్తే బొప్పాయి ఆకులు బాగా పని చేస్తున్నారు. అలానే చర్మంపై ర్యాషెస్, జైంట్ పెయిన్స్, వాంతులు, తలనొప్పి, జ్వరం కూడా తగ్గుతుంది. బ్లడ్ ప్లేట్లెట్స్ లెవల్స్ ను కూడా పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
రాష్ట్ర మలేరియా గుణాలు:
ఆయుర్వేద వైద్యంలో కూడా బొప్పాయి ఆకులకి ప్రత్యేక స్థానం ఉంది. మలేరియా, డయాబెటిస్, క్యాన్సర్ తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆకలి లేకపోవడం, వాంతులు, డయేరియా వంటి సమస్యలు తగ్గుతాయి. ఆఫ్రికన్ దేశాలలో మలేరియాని తగ్గించడానికి వాడతారు.
లివర్ కి మంచిది:
లివర్ ఆరోగ్యానికి కూడా ఇది బాగా మేలు చేస్తుంది. ఇందులో ఆట ఆఫ్‌లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. జాండీస్ మరియు లివర్ సమస్యలని కూడా తగ్గిస్తుంది. లివర్ క్యాన్సర్ రిస్క్ కూడా దీని వల్ల తగ్గుతుంది.
బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి:
బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది.