ప్రతి రోజు పాలు తాగడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని రకాలైన పోషక విచర్మ సౌందర్యంవలు అందుతాయి. ఆరోగ్యానికీ, ఎదుగు దలకూ పాలు చాలా అవసరం. ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ, రోగాల్ని నివారించడంలోనూ పాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే పాలను ప్రకృతి సిద్ధమైన ‘పరిపూర్ణ పౌష్టి కాహారం’ కింద చెబుతుంటారు. పాలు తాగటం వల్ల కళ్ళు ప్రకాశవంతంగా అవుతాయి. శరీరానికి ఆరోగ్యకరమైన మెరుపు వస్తుంది.
శరీరంలోని అవయవాలన్నిటిలోకి సరిపడా శక్తి చేరుకుంటుంది. అనేక జబ్బులకు చెక్ పెట్టే పాలు ఆరోగ్యానికే కాదు.. చర్మ సౌందర్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కాస్మెటిక్స్లాంటి సౌందర్య సాధనాలలో కూడా పాలను ఉపయోగిస్తాయు. పాలు అనేక రకాలుగా చర్య సమస్యలకు ఉపయోగపడుతుంది. మరి అది ఎలాగో ఓ లుక్కేయండి..
– పాలల్లో ఒక స్పూన్ తేనె, కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించి కొంత సమయం తర్వాత స్నాసం చేయడం వల్ల మంచి టోన్ లభిస్తుంది.
– ప్రతి రోజు పాలను పెదాలకు మర్ధన చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల పెదాల నలుపుదనం పోయి అందంగా కనిపిస్తాయి.
– పాలలో కొంచెం తేనెను కలిపి బాగా మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై మచ్చలు తొలగిపోతాయి.
– పచ్చిగుడ్డు సొనను పాలలో కలుపి తలకు పట్టించి కొంత సమయం తర్వాత తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పెరగటమే కాదు బలంగా కూడా ఉంటుంది.
– పచ్చి పాలల్లో కొంచె తేనె కలిపి బాగా మిక్స్ చేసి ఫేస్ అప్లై చేయాలి. కొంత సమయం తర్వాత వాష్ చేసుకుంటే ముఖంపై పేరుకున్న మురికి, జిడ్డు తొలిగి కాంతివంతంగా మారుతుంది.
– పాలలో కొంచెం ముల్తాని మట్టి కలిపి ఫేస్ ప్లాక్ వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.
– పాలపైని మీగడలో కొద్దిపాటి వినెగార్, చిటికెడు పసుపు కలిపి గాయాలు, పుళ్ళు, మొదలైన వాటిమీద అప్లై చేస్తే అవి త్వరలోనే తగ్గిపోతాయి.
– పాలలో కొంచెం రోజ్ వాటల్ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ముఖంపై అప్లై చేసుకుని 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం నిగారింపుగా ఉంటుంది.