బ్రెయిన్ అనూరిజం అనే పదాన్ని మీరెప్పుడైనా విన్నారా..? చాలా తక్కువ మందికి తెలుసు కానీ..ఎక్కువ మందికి వస్తుంది. ఇండియాలో ఈ వ్యాధి భారిన పడే వారి సంఖ్య పెరుగుతుందని గణాంకాలు చెబుతున్నాయి. హాలివుడ్ నటీనటుల్లో చాలామంది ఈ వ్యాధి భారిన పడ్డారు. మనదేశంలో ఎమర్జెన్సీగా ఆసుపత్రుల్లో చేరిన కేసుల్లో బ్రెయిన్ అనూరిజం రోగులు కూడా అధికంగా ఉంటున్నాయట. మరీ అసలు ఇది ఎలా వస్తుంది..? లక్షణాలు ఏంటో ఓ సారి చూద్దాం..!
మనదేశంలో బ్రెయిన్ అనూరిజం బారినపడిన వారిలో 40 శాతం మందికి ప్రాణాంతక పరిస్థితులు ఎదురయ్యాయి. నిజానికి ఇది సాధారణ వ్యాధే. కానీ సరైన చికిత్స తీసుకోకపోవడం, సకాలంలో స్పందించకపోవడం వల్ల ఇది ప్రాణాంతకంగా మారిపోతోందట.. ప్రస్తుతం మనదేశంలో ప్రతి వందమందిలో ఒకరికి బ్రెయిన్ అనూరిజం వస్తోందని నిపుణులు అంటున్నారు.
బ్రెయిన్ అనూరిజం అంటే ఏంటి..?
అనూరిజం అంటే.. మెదడులోని రక్తనాళంలో వాపు రావడం. రక్తనాళంలో బెలూన్ లేదా బుడగను ఏర్పరస్తుంది. ఇది పగలకముందే చికిత్స చేసుకోవాలి. ఇది బాగా పెరిగి పగిలితే రక్తనాళాలు చిట్లి రక్తస్రావం అవుతుంది. అప్పుడు పరిస్థితి చేయిదాటి పోయి ప్రాణాంతకంగా మారుతుంది. ఇలా బుడగ పగిలి పేలినప్పుడే చాలా మంది చనిపోతారు. టీ తాగుతున్నప్పుడు, పేపర్ చదువుతున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు ఎప్పుడైనా కూడా ఇది జరగవచ్చు. బుడగ పేలాక కూడా కొంత మంది రోగులు సకాలంలో ఆసుపత్రిలో చేరినప్పటికీ కోమాలోకి వెళ్లడం, పక్షవాతం బారిన పడం, వెంటిలేటర్ పై ఉండటం జరుగుతుంది. బుడక పేలాక ఆకస్మిక మరణం సంభవించడమే అధికంగా జరుగుతుంది.
లక్షణాలు…
తీవ్రమైన తలనొప్పి, వికారం, మెడ భాగంలో గట్టిగా మారడం, చూపు మసకబారడం, వెలుగు చూడలేకపోవడం, కళ్ల వెనుక నొప్పి పెట్టం, గందరగోళంగా అనిపించడం, స్పృహ కోల్పోవడం వంటి సమస్యలు కలుగుతాయి.వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఏ లక్షణమైనా మూడు రోజులకు కంటే ఎక్కువ ఉంటే.. వెంటనే వైద్యులను సంప్రదించాలి.మనదేశంలో ఏటా 76,500 నుంచి 204,100 వరకు అనూరిజం కేసులు బయటపడుతున్నాయి. సకాలంలో మెదడు స్క్రీనింగ్ చేయడం వల్ల ప్రాణనష్టాన్ని తగ్గించుకోవచ్చు.