ఈ మధ్య కాలంలో చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అలా సమస్యలేమి కలగకుండా ఉండాలంటే మంచి పోషకాహారం తీసుకుంటూ ఉండాలి. దానితో పాటు వ్యాయామం నిద్ర కూడా చాలా ముఖ్యం.
ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది బాధ పడుతున్న సమస్యలల్లో కొలెస్ట్రాల్ ఒకటి. కొలెస్ట్రాల్ వలన చాలామంది ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఎక్కువగా కొలెస్ట్రాల్ అధిక బరువు సమస్యతో బాధపడే వారిలో ఉంటుంది కానీ సన్నగా ఉండే వాటిలో కూడా రావచ్చు జాగ్రత్త.
ఉసిరి జ్యూస్ కొలెస్ట్రాల్ సమస్య ని దూరం చేయగలదు. అలానే అర్జున కూడా మీకు సహాయ పడుతుంది. ఉసిరికాయలని బాగా కడిగి చిన్న ముక్కలు కింద కోసుకుని మిక్సీలో గుజ్జులా చేసుకోవాలి ఆ గుజ్జు నుండి రసాన్ని తీసేయాలి. ఒక గిన్నెలో రెండు కప్పులు నీళ్లు పోసి ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు అర్జున చెట్టు బెరడు ముక్కలు కూడా వేసి మరిగించుకోండి.
చల్లారిన తర్వాత ఇందులోనే మీరు ఉసిరి రసాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ జ్యూస్ ని వడకట్టుకుని స్టోర్ చేసుకోండి. దీన్ని కనుక మీరు రోజూ తీసుకుంటే కొలెస్ట్రాల్ సమస్య నుండి బయట పడొచ్చు.
ఈ ప్రయోజనాలు కూడా పొందొచ్చు:
మలబద్ధకం, యాసిడ్ రిఫ్లెక్స్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా ఈ జ్యూస్ తో మాయమవుతాయి. చర్మం కూడా బాగుంటుంది. హృదయ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు రక్తపోటు సమస్య ఉండదు.