Constipation:ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో మలబద్ధకం కూడా ఒకటి. చాలా మంది ఈ సమస్య తో బాధపడుతూ ఉంటారు ఈ సమస్య లేకుండా ఉండాలంటే సరైన జీవన విధానాన్ని అనుసరించాలి. మంచి ఆహారం తీసుకోవాలి. ఒత్తిడి లేకుండా ఉండాలి. మంచి నిద్ర ఉండాలి. అలానే నీళ్ళని కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అయితే మలబద్ధకం సమస్య ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ సమస్యని అసలు నిర్లక్ష్యం చేయకూడదు. మలబద్ధకం సమస్య నుండి బయట పడాలంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మలబద్ధకంతో బాధపడే వాళ్ళు అరటి పండ్లను తీసుకోవాలి. అరటి పండ్లు మలబద్దకాన్ని తగ్గిస్తాయి. అరటికాయ ఎక్కువ తీసుకుంటే మలబద్దకానికి దారి తీస్తుంది. అరటికాయలో పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి జీర్ణం అవ్వడానికి కష్టంగా ఉంటుంది. ఫైబర్ కూడా ఇందులో ఉంటుంది పేగుల నుండి నీటిని మలం వైపుకు లాగుతుంది. డిహైడ్రేషన్ కి గురవుతున్నట్లయితే మలబద్ధకాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. వైట్ రైస్ మలబద్ధకాన్ని కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు తెల్ల బియ్యం లో పొట్టు ఉండదు. అదే బ్రౌన్ రైస్ తీసుకుంటే మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.
హోల్ గ్రైన్ బ్రెడ్ ని తీసుకుంటే మలబద్దకం సమస్య నుండి దూరంగా ఉండొచ్చు వైట్ బ్రెడ్ మలబద్ధకం సమస్యను ఎక్కువ చేస్తుంది. ఇరిటేటబుల్ బౌల్ సిండ్రోమ్ సమస్యతో బాధపడే వాళ్ళు చాక్లెట్లు తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. చాక్లెట్లలో పెద్ద మొత్తంలో కొవ్వు ఉంటుంది ఇది డైజెషన్ ని స్లోగా చేస్తుంది. దీంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పాలు, పెరుగు, ఐస్ క్రీమ్, చీజ్ వంటివి ఎక్కువ తీసుకుంటే మలబద్ధకం సమస్య వస్తుంది కాబట్టి డైరీ ప్రొడక్ట్స్ కి కూడా దూరంగా ఉండాలి లేకపోతే లేనిపోని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.