రాత్రి 10కి ముందే పడుకుంటే డేంజరే..!

-

రాత్రి త్వరగా పడుకుంటే పొద్దున్నే త్వరగా లేవొచ్చు.. పిల్లలు స్కూల్‌కి, పెద్దవాళ్లు వారి వారి కార్యకలాపాలకు ఆలస్యంగా కాకుండా చూసుకోవచ్చని చాలా మంది అనుకుంటారు. అలా అనే పదికంటే ముందే నిద్రపోవడానికి సిద్ధం అవుతున్నారు. అయితే ఇలాంటి వారు కొందరు ఉంటే.. రాత్రి 12 దాటినా సోషల్ మీడియాలో ఏదో ఒకటి చూస్తూ గడిపే వాళ్లు ఉన్నారు. తాజాగా ఓ సర్వేలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వే ఏం చెప్తుందో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. అవి ఏంటంటే.. రాత్రి 10 కంటే ముందే నిద్రపోయే వారికి హార్ట్ ఎటాక్ వచ్చే సమస్య ఎక్కువగా ఉందని తెలుపుతున్నాయి.

sleeping-problems-women
sleeping-problems-women

అవునండీ! 21 దేశాల్లో 5,633 మంది మరణాల మీద సర్వే చేసిన కొందరు సైంటిస్టులు వారి అలవాట్లు, ఇతర అంశాలను విశ్లేషించారు. రాత్రి 10 గంటల కంటే ముందే నిద్రపోయే వారిలో హార్ట్‌ఎటాక్ వచ్చే అవకాశం 9 శాతం ఎక్కువగా ఉందట. ఈ అంశాన్ని సైంటిస్టులు మెడికల్ జర్నల్ స్లీప్ మెడిసిన్‌లో పొందుపరిచారు. ఈ సర్వేలో ఎక్కువ మంది రాత్రి 10 కంటే ముందే నిద్రపోయేవారు. వీరిలో కొందరు పెద్దవారు, మరికొందరు తక్కువ చదువుకున్నవారు ఉన్నారు. ఇక పల్లెటూర్లో ఉండేవాళ్లు కూడా ఉన్నారు. ఈ సర్వేలో మందుబాబులు కూడా ఉన్నారట. వీరిలో రాత్రి 10 గంటల నుంచి 12 గంటల మధ్య నిద్రపోయే వారిలో గుండెకు సంబంధించిన సమస్యలు తక్కువగా కనిపించాయి. 10 గంటల కంటే ముందే పడుకునే వారిలో కొన్ని అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు వెల్లడించారు.

మొత్తంగా నిపుణులు ఏం చెబుతున్నారంటే.. త్వరగా నిద్రపోవడం లేదా బాగా లేట్‌గా అంటే రాత్రి 3 గంటల తర్వాత నిద్రపోవటం వల్ల కార్డియాక్ రిథమ్ దెబ్బతింటుంది. మనకు మాములుగానే నిద్రమీద కంట్రోల్ ఉండదు. కొందరు అయితే బెడ్ ఎక్కిన 10 నిమిషాలకే నిద్రలోకి జారుకుంటారు. మరికొందరు దొర్లి దొర్లి ఎప్పటికో పడుకుంటారు. మానవ శరీరం పగలు, రాత్రికి అనుగుణంగా ప్రవర్తిస్తుందట. కాబట్టి ఇక నుంచి అయినా త్వరగా నిద్రపోవాలి త్వరగా లేవాలి అనే ఆచారన్ని పాటించేవాళ్లు ఓ సారి డాక్టర్‌ను సంప్రదించి మార్చుకుంటే మంచింది. మనిషికి 8 గంటల నిద్ర అవసరం. కానీ, అది ఏ టైంకి అనేది తెలుసుకోవటం మరీ అవసరం.

Read more RELATED
Recommended to you

Latest news