వర్క్ స్టాట్ చేసేప్పుడు ప్రతి ఉద్యోగి ఈరోజు ఇరగదీయాలి..బాగా చేయాలి అనుకుంటాడు..కానీ అదేంటో డ్యూటీ స్టాట్ చేసిన కొద్దిసేపటికే ఎక్కడలేని నీరసం, చిరాకు, టైం వేస్ట్ అవుతుంది. దాంతో..ఎప్పుడు టైం అవుతుందిరా బాబూ అనుకుంటాం..ఇలా చాలామందికి జరిగే ఉంటుంది. శారీరకంగా దృఢంగా ఉన్నా మానసికంగా కుంగిపోతున్నారు. అసలు వేటివల్ల అంత త్వరగా శక్తిని కోల్పోతున్నారు? తీవ్ర ఒత్తిడికి గురై మానసిక ప్రశాంతత కోల్పోవడానికి గల కారణాలేంటి? తిరిగి శక్తిని ఎలా సంపాదించుకోవాలనే విషయాల గురించి చూద్దాం.
నైట్ తాగిన కాఫీ..
మనం నిద్రించే సమయానికి ముందు తాగే కాఫీ నిద్రపైనా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది..మన ఎనర్జీ లెవల్స్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి పడుకునే ముందు టీ, కాఫీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
వ్యాయామం వదిలేసినా..
అందరూ వ్యాయామం చేస్తే ఎనర్జీ పోయి త్వరగా అలసిపోతారని అనుకుంటారు. కానీ, వ్యాయామం చేయకపోతేనే శరీరం బద్ధకంగా తయారై అలసిపోయినట్లుగా అనిపిస్తుంది. వాస్తవానికి వ్యాయామం 60 శాతం శరీర అలసటను తగ్గిస్తుందని జార్జియా యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడించారు. అంతేకాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేసినవారు రోజంతా చాలా యాక్టివ్‌గా ఉండి తమ పనులను విజయవంతంగా పూర్తి చేసుకుంటారు.
డీహైడ్రేషన్..
మనిషి శరీరానికి నీరు చాలా అవసరమని అందరూ చెప్తూనే ఉంటారు..మనం వింటూనే ఉంటాం..కానీ సరిపడా తాగం..బాగా దాహమేసినప్పుడే తాగుతాం..గంట గంటకు వాటర్ తాగలాని నియమం పెట్టుకుని రోజు మొత్తంలో 4 లీటర్ల నీళ్లు తాగేవాళ్లు చాలా తక్కువగా ఉంటారు. నీరు తగినంతగా తీసుకోకపోతే డీహైడ్రేషన్‌కు గురవ్వడం, శరీర అవయవాల పనితీరు మందగించడం వంటి సమస్యలు వస్తాయి. డీహైడ్రేషన్‌కు గురైన వారిలో చర్మం, కళ్లు పొడిబారిపోతాయి. చిరాగ్గా అనిపిస్తుంది. కేవలం వేసవి కాలంలో మాత్రమే శరీరం డీ హైడ్రేషన్‌కు గురవ్వాలని ఏమీ లేదు. శరీరంలో నీటిస్థాయిలు తగ్గినప్పుడు ఎప్పుడైనా ఈ సమస్య వస్తుంది.
మల్టీటాస్కింగ్..
ఒకేసారి మనం రెండు మూడు పనులు చేసి రిలాక్స్ అవుదామని భావిస్తాం. కానీ, దీనివల్ల తొందరగా శక్తిని కోల్పోతాం. కంపెనీ అవసరాలకు అనుగుణంగా కొన్నిసార్లు ఒకటికి మించి పనులు చేయాల్సి వస్తోంది. దీనివల్ల మెదడు చాలా శక్తిని కోల్పోతుంది. దీంతో మానసికంగా బాగా టైడ్ అయిపోతాం. ఇటువంటి పనులను ఒకేసారి కాకుండా విభజించి చేసుకోవాలి. మధ్యమధ్యలో బ్రేక్ తప్పనిసరిగా తీసుకోవాలి. అదేపనిగా చేస్తూ పోతే చేసే పనిమీద దృష్టి కేంద్రీకరించడం అసలు అవ్వదు.
బెడ్ మీద మొబైల్ పట్టుకొని..
మొబైల్ ఫోన్ కూడా ఒకరకంగా మానసిక ఒత్తిడికి కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రుళ్లు మొబైల్ అతిగా వాడటం వల్ల దీనిలోని నీలికాంతి వల్ల ఆరోగ్యానికి చేటు కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి రాత్రుళ్లు పడుకునే ముందు ఫోన్ జోలికి పోకుండా ఉండడమే ఉత్తమం.
నోరు తెరిచి నిద్రపోతే..
మనం ఒకసారి నిద్రలోకి జారుకున్నాక గురక పెడుతుంటారు. అయినా ఒకరు చెబితే కానీ, అది వారికి తెలియదు. ఇంకొందరు వారికి తెలియకుండానే నోరు తెరిచి నిద్రిస్తుంటారు. దీనివల్ల వారి శరీరం డీహైడ్రేషన్‌కు లోనయ్యే అవకాశాలుంటాయి. ఇది రోజువారీ ఎనర్జీ లెవల్స్ మీద ప్రభావం చూపుతుంది. నిద్రలో గురక పెట్టే వారు కొన్ని బ్రీథింగ్ ఎక్సర్‌సైజ్ చేయడం బెటర్.
కూర్చొనే విధానం ఎలా ఉంది?
మన ఎనర్జీ లెవల్స్ తగ్గిపోయి.. శరీరం త్వరగా అలసిపోవడానికి మన కూర్చొని పనిచేసే విధానం కూడా ఒక కారణం..సరైన పద్ధతిలో కూర్చొకుండా పనిచేయడం వల్ల కీళ్లు, కండరాలపై భారం పడుతుంది. తలవాల్చడం, సిస్టమ్‌ను దగ్గరగా చూడడం, కుర్చీలో సరిగా కూర్చోకపోవడం వల్ల త్వరగా ఎనర్జీ కోల్పోయే అవకాశం ఉంది. కూర్చొని విధానంలో నడుంపై భారం పడకుండా కొన్ని మార్పులు చేసుకోవాలి. కొన్ని నిమిషాలపాటు మధ్యమధ్యలో నడిస్తే ఇంకా మంచిది.
వీటిలో మీరు చేసే తప్పు ఉందా..అందరిలో అయితే కామన్ గా ఉండే మిస్టేక్..వర్క ఫ్రం హోమ్ లో ఇష్టం వచ్చినట్లు కుర్చోవడం..దానివల్ల తెలియకుండానే ఎక్కడ లేని నొప్పులు తెచ్చుకోవడం.ఏం అంటారు..!