ప్రెషర్ కుక్కర్‌లో ఈ 3 రకాల పదార్థాలను ఉడికించకూడదట..! తింటే ప్రమాదమే

-

ప్రెషర్ కుక్కర్ లేని వంటిల్లు ఉండేదేమో కదా..పని త్వరగా సులభంగా అయిపోవాలని అందరూ వీటిని వాడుతుంటారు. ఎక్కువ సమయం పట్టే ఐటమ్స్ ని ప్రెషర్ కుక్కర్లో ఉడికిస్తాం..ఇలా మహిళల వంటింటి సామ్రాజ్యంలో ప్రెషర్ కుక్కర్ ఒక ఆయుధం అయిపోయింది. అయితే మీకు ఈ విషయం తెలుసా..ప్రషర్ కుక్కర్లో కొన్ని రకాల వంటలు అస్సలు వండకూడదట. అలా వండటం వల్ల ఆహారపదార్థాలు విషపూరితంగా మారి శరీరంపై దుష్ప్రభావాలు చూపుతాయి. అయితే ఒకసారికే ఇలా జరగదు..రోజు చేస్తుంటే ఇలాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అంటో స్లో పాయిజన్ లా ఇవి శరీరం అంతటా వ్యాపిస్తాయని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ప్రెషర్ కుక్కర్లో వండకూడని పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.

అన్నం..

అవును మీరు విన్నది నిజమే..అన్నం ప్రెషర్ కుక్కర్లో వండకూడదు. మీలో చాలమంది అన్నాన్ని ఇందులోనే వండుతారు. నిజానికి ఇది చాలా హానికరం. ప్రెషర్ కుక్కర్లో అన్నం వండడం వల్ల అక్రిలమైడ్ అనే హానికరమైన రసాయనం ఏర్పడుతుందట. దీని ఎఫెక్ట్ వెంటనే చూపకపోయినా.. దీర్ఘకాలం కొనసాగితే మాత్రం ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తుంది. ఎప్పుడో ఒకసారి అత్యవసరంగా అయితే పర్వాలేదు కానీ.. ప్రతీ రోజు ఇలానే చేస్తే మాత్రం అనారోగ్యం పాలవ్వడం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రెషర్ కుక్కర్లో వండిన అన్నం తినడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉందట.

బంగాళదుంపలు..

ఇది కూడా మీకు షాకింగ్ గానే అనిపిస్తుంది. అరే మనం బంగాళదుంప కూర వండాలన్నప్పుడంతా..కుక్కర్లో వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచుంతామే అనుకుంటున్నారు కదా.. అయితే ఇలా చేయడం ప్రమాదకరం అని వైద్యులు తెలిపారు. బంగాళదుంపలో ఎక్కువగా పిండి పదర్థాం ఉంటుంది. ఇలా అధికంగా స్టార్చ్ ఉండే వాటిని కుక్కర్లో వండకూడదు. దీర్ఘకాలంగా ఇలా కుక్కర్లో ఉడకబెట్టిన బంగాళాదుంపలను తినడం వల్ల క్యాన్సర్, న్యూరోలాజికల్ డిజార్డర్ వంటి అనే ఆరోగ్య వ్యాధులకు దారితీస్తుంది. అందుకే వీటిపై వండటం మానేయడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

పాస్తా

పాస్తాలో కూడా పిండి పదార్థం అధికంగా ఉంటుంది. అందుకే దీన్ని కూడా కుక్కర్లో వండకూడదు అంటున్నారు నిపుణలు..
నెలలో ఒక్కసారి వండుకుంటే ఏం కాదు.. కానీ దీనినే అలవాటుగా మార్చుకుంటే మాత్రం ప్రమాదం. పిండిపదర్థాలు అధికంగా ఉండే వాటిని మాత్రమే వీటిలో వండకూడదు. మిగతా వాటిని వండుకోవచ్చు అంటూ చెబుతున్నారు.

ఇదండి మ్యాటర్..వీటిని ఇకనుంచి అయినా ప్రషర్ కుక్కర్లో వండటం తగ్గించటానికి ప్రయత్నించండి. ఆరోగ్యంగా ఉండటం కోసం తింటాం… కానీ మనం తినే ఆహారం హానికరం అవ్వకూడదు కదా.

Read more RELATED
Recommended to you

Latest news