చలికాలంలో ఇంట్లో వస్తువులను పట్టుకుంటే షాక్‌ కొట్టినట్లు అనిపిస్తుందా..?

-

ఇంట్లో కొన్ని వస్తువులను పట్టుకున్నప్పుడు కరెంట్‌ షాక్‌ తగిలినట్లు అనిపిస్తుంది. కుర్చీలు, ఆఫీస్‌ డోర్లు ఇలాంటివి. అలాగే షేక్‌ హ్యాండ్‌ ఇచ్చినప్పుడు కూడా షాక్‌ తగిలిన అనుభూతి ఉంటుంది. దాని అర్థం..సినిమాలో చూపించినట్లు కాదు. ఐతే ఇది ఎందుకు జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి చలికాలంలో ఈ తరహా సంఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఎందుకంటే శీతాకాలంలో గాలిలో తేమ చాలా తక్కువగా ఉంటుంది. రోజు వారీ వస్తువుల్లో కరెంట్‌ షాక్‌ ఎలా, ఎందుకు ఉత్పత్తి అవుతుందంటే..

భౌతిక శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే.. ఈ ప్రపంచంలోని పదార్ధాలన్నీ పరమాణువులతో తయారవుతాయి. ఈ పరమాణువు ప్రతికూలంగా చార్జ్ చేయబడిన ఎలక్ట్రాన్లు, ధనాత్మకంగా చార్జ్ చేయబడిన ప్రోటాన్లు, తటస్థ న్యూట్రాన్లను కూడా కలిగి ఉంటాయి. మన శరీరంలో ఎప్పుడూ ఒకే సంఖ్యలో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు ఉంటాయి. శరీరం అణువులను స్థిరంగా ఉంచుతుంది. ఐతే అవి ఎప్పుడైతే అసమతుల్యమౌతాయో అంటే వాటి సంఖ్యలో సమానత కొరవడినప్పుడు ఎలక్ట్రాన్లలో చలనం సంభవిస్తుంది.

సైన్స్ ప్రకారం.. ఎలక్ట్రాన్ల సంఖ్య పెరిగేకొద్దీ, నెగెటివ్‌ చార్జ్‌ను సృష్టించి, పాజిటివ్‌ ఎలక్ట్రాన్ల మాదిరి కదులుతాయి. మనం ఏదైనా వస్తువు లేదా మనిషిని తాకినప్పుడు దానిలోని పాజిటివ్‌ ఎలక్ట్రాన్లు, మనలో నెగిటివ్‌ ఎలక్ట్రాన్లను సృష్టిస్తుంది. దీని వల్ల మనకు షాక్‌ తగిలినట్లు అనిపిస్తుందట.. ఇంత జరుగుతుంది బ్యాక్‌ గ్రౌండ్‌లో..ఈ విధమైన వైబ్రేషన్‌ కొన్ని సందర్భాల్లో కొన్ని అంగుళాల దూరం వరకు సంభవిస్తుంది. కొన్నిసార్లు స్వెటర్ల వంటి ఉన్ని వస్తువులను తాకినప్పుడు కూడా ఇలానే జరుగుతుంది. స్వెటర్లు తీయగానే విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఈ విధమైన కరెంట్‌ మన వెంట్రుకల్లో కూడా ఉత్పత్తి అవుతుందట.

తాకినప్పుడు కరెంట్ ఎలా పుడుతుంది?

ఎలక్ట్రాన్లు నెటెటివ్‌ చార్జ్ కలిగి ఉంటాయి. ప్రోటాన్లు పాజిటివ్‌ చార్జ్ కలిగి ఉంటాయి. న్యూట్రాన్ తటస్థంగా ఉంటుంది. అణువు కేంద్రకంలో ప్రోటాన్లు ఉంటే, ఎలక్ట్రాన్లు మాత్రం న్యూక్లియస్ చుట్టూ తిరుగుతాయి. ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు సమాన సంఖ్యలో ఉన్నప్పుడు అణువు స్థిరంగా ఉంటుంది. ఈ రెండింటి సంఖ్యలో తేడా ఏర్పడితే, ఎలక్ట్రాన్లు బౌన్స్ అవ్వడం ప్రారంభిస్తాయి. దీంతో అణువులో కదలిక ఏర్పడి.. కరెంట్‌ ఉత్పత్తి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version