తొమ్మిది నుండి ఐదు వరకు ఉద్యోగం చేస్తుంటారా..? అయితే ఇలా డైట్ ని ఫాలో అవ్వాల్సిందే..!

-

ఈ మధ్య ప్రతి ఒక్కరూ ఉద్యోగాలను చేస్తున్నారు. కేవలం మగవారు మాత్రమే కాదు ఆడవాళ్లు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. పైగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అలా ఆఫీస్ పని చేసుకుంటూ ఉంటున్నారు. నిజానికి అలా ఎక్కువ పని చేయడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే డైట్ లో మార్పులు చేసుకోవాలి.

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వర్క్ లో ఉండి పోయే వాళ్లు ఈ డైట్ ను ఫాలో అయితే ఆరోగ్యంగా ఉండొచ్చు. రాత్రి నిద్ర పోయిన తర్వాత నుంచి ఉదయం తినే వరకు ఎంతో ఎక్కువగా ఉంటుంది. అందుకని ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉండేటట్టు చూసుకోవాలి. ఇడ్లీ సాంబార్, ఆమ్లెట్ విత్ టోస్ట్ ఇలాంటి వాటిని ఎంపిక చేసుకోవాలి. అలానే మధ్యాహ్నం ఆహారం తీసుకోవడానికి అల్పాహారం కి మధ్య కొబ్బరినీళ్లు లేదంటే పండ్లు కానీ బట్టర్ మిల్క్ ని కానీ తీసుకోండి.

మధ్యాహ్నం తీసుకునే ఆహారం కాస్త హెవీగా తీసుకున్నట్లయితే బద్ధకంగా ఉన్నట్లు ఉంటుంది అందుకని బ్యాలెన్సుడ్ గా తీసుకోండి. పప్పు, అన్నం, రోటి ఇలా మీకిష్టమైనవి తీసుకోవచ్చు నాలుగు నుంచి ఆరు గంటల మధ్యలో ఏదైనా స్నాక్స్ తీసుకోండి రోస్ట్ చేసిన శనగలు మఖాన వంటివి తీసుకోవచ్చు. లేదంటే ఏదైనా పండ్లు మీరు తెలుసుకోవచ్చు. డిన్నర్ ఎప్పుడు కూడా ఎంతో లైట్ గా ఉండేటట్లు చూసుకోండి ఇలా మీరు డైట్ లో మార్పులు చేసుకుంటే అనారోగ్య సమస్యలు ఉండవు పైగా బ్యాలెన్స్డ్ డైట్ కూడా తీసుకున్నట్లు అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news