చిరుధాన్యాలు తిన్నాక కడుపు ఉబ్బరంగా ఉంటుందా..? ఇలా చేస్తే ఆ సమస్య రాదు..!!

-

ఒకప్పుడు ఆహారం అంటే చిరుధాన్యాలే ఉండేవి.. కానీ ఇప్పుడు అందరూ వైట్‌ రైస్‌ వాడుతున్నారు..ఇప్పుడిప్పుడే జనాల్లో ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది.. మళ్లీ చిరుధాన్యాల వైపు చూస్తున్నారు. అయితే చాలామందిలో వచ్చే కామన్‌ సమస్య..చిరుధాన్యాలు తింటే కడుపు ఉబ్బరంగా ఉంటుంది అని..! అవును నిజమే అలానే అవుతుంది ఎందుకు..మంచివి మంచివి అంటారు.. తింటే ఇలాంటి ఇబ్బందులు. ఎట్లా మరీ..!

మిల్లెట్స్ తినడం వల్ల టైప్ -2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మిల్లెట్స్‌తో తయారు చేసిన ఫుడ్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటుంది. వీటిని సరైన పద్ధతిలో తీసుకోవడం వల్ల ఇవి తిన్నాక కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబ్ధకం లాంటి సమస్యలను అధిగమించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. పచ్చిగా ఉన్న వాటిని నేరుగా తినడం వల్ల ఇవి వాతాన్ని పెంచుతాయి. అందువల్లే మలబద్ధకం, ఉబ్బరానికి దారి తీస్తాయి. వాతంతో బాధపడుతున్న వాళ్ళని ఇవి మరింత ఇబ్బందులకి గురిచేస్తాయి. అందుకే వీటిని తీసుకునే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

చిరు ధాన్యాలు ఎలా తీసుకోవాలి..?

తినడానికి ముందుగా కనీసం ఐదు నుంచి ఆరు గంటల పాటు బాగా నీటిలో నానబెట్టాలి

వాటిని వండేటప్పుడు నెయ్యి, రాళ్ళ ఉప్పు, అల్లం పొడి(శొంఠి) వేయాలి.

చిరుధాన్యాలతో చేసుకున్న పదార్థాలు తినేటప్పుడు బాగా ఉడికించిన కూరగాయలతో కలిపి తీసుకోవాలి.

ఫైబర్, అమైనో ఆమ్లాలు, విటమిన్ బితో పాటు శరీరానికి ముఖ్యమైన ఖనిజాలు అందించడంలో చిరు ధాన్యాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. గోధుమలు తినలేని వాళ్ళకి ఇవి ప్రత్యామ్నాయంగా ఉంటాయి. చిరు ధాన్యాల్లో శరీరానికి కావలసిన పూర్తి స్థాయి పోషకాలు అందుతాయి. చిరు ధాన్యాలు చేసిన పిండితో రొట్టెలు, సంకటి ఇలా ఏది చేసుకున్నా రుచిగానే ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నపుడే 2022-23 సంవత్సరాన్ని ‘అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం’గా ప్రకటించింది. త్వరలో వీటి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. డిమాండ్‌ పెరిగితే ధర ఆటోమెటిక్‌గా పెరుగుతుంది. రోజు కాకపోయిన అప్పుడప్పుడైన చిరుధాన్యాలు తినేందుకు ప్రయత్నించండి.! బరువు తగ్గాలనుకునేవారు అయితే కచ్చితంగా వీటిని డైట్‌లో చేర్చుకోవాల్సిందే.!

Read more RELATED
Recommended to you

Latest news