స్పైసీగా ఉండే ఫుడ్ అంటే చాలామంది ఇష్టపడతారు.. అయితే రోజూ తినమంటే ఎవరూ తినలేరనుకోండి. వారానికి ఒకటి రెండు సార్లు తింటే ఏం కాదు.. కానీ.. రోజు కడుపునిండా తింటున్నప్పటికి కూడా.. డైలీ స్పైసీగా ఉండేది ఏదైనా ఉంటే బాగుండు, బాగా కారంగా ఉండేవి తినాలపిస్తుంది అనే కోరిక మనకు అప్పుడప్పుడు కలుగుతుంది. ఇలా అనిపించడానికి చాలా కారణాలు ఉంటాయట.. ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే..
గర్భం ధరించినా…
గర్భం ధరించిన మహిళల్లో కారం, మసాలా ఘాటు తగిలే ఆహారాన్ని తినాలన్న కోరిక బాగా ఉంటుందట.. అలాగే చాక్లెట్లు, స్వీట్లు కూడా తినాలనిపిస్తుంది. శరీరంలో హార్మోన్ల మార్పుల వల్ల, స్పైసీ ఫుడ్‌లో ఉండే కొన్ని ఆహార రసాయనాల వల్ల ఈ కోరికలు కలుగుతాయని వైద్యులు అంటున్నారు.
డిప్రెషన్
ఇది కొంచె ఇంట్రస్టింగ్ రీజన్.. నిరాశలో, కుంగిపోయి ఉన్నప్పుడు కారంగా ఉండే ఆహారాన్ని తినాలనే కోరిక ఉంటుందట..అసలు బాధలో ఉంటే ఏం తినాలనిపించదు.. ఆపై మళ్లీ స్పైసీ ఫుడ్ హా ఆశ్యర్యంగా చూస్తున్నారా..? మీరు బాగా అబ్‌సర్వ్ చేయండి చాలామంది..డిప్రషన్‌లో ఉన్నప్పుడు స్పైసీ ఫుడ్‌నే ఎంచుకుంటారు.
వాతావరణం
ఇది అయితే అందరికీ కామన్‌గానే తెలిసిన విషయం.. వెదర్ చల్లగా ఉంటే..మనకు వేడిగా కారంగా ఉండేవి తినాలనిపిస్తుంది. ఇది శరీరంలో వెచ్చదనాన్ని కలిగింది చలిని దూరం పెడుతుంది. అందుకే మన శరీరంలో చల్లని వాతావరణంలో స్పైసీ ఫుడ్‌ను కోరుకుంటుంది.
ముక్కు కారడం
ఇది జలుబు లాంటిదే కానీ జలుబు కాదు..ముక్కులోంచి వాటర్ వస్తుంటాయి.. ఎంత తుడుచుకున్నా కారుతూనే ఉంటుంది. ఇది ఒక రకరమైన ఇరిటేషన్‌కు దారితీస్తుంది. దీన్నే రినైటిస్ అంటారు. అప్పుడు కూడా బాగా కారం కారంగా ఉండేవి తినాలపిస్తుంది. ఎందుకంటే. స్పైసీ ఫుడ్‌లో రినైటిస్ లక్షణాలు తగ్గించే లక్షణాలు ఉంటాయట.
సో..ఈ కారణాలు వల్ల స్పైసీ ఫుడ్ తినాలిపిస్తుందట.. కొంతమందికి ఇవేవీ లేకున్నా కూడా.. డైలీ వెజ్ కర్రీస్ తినీ తినీ అవి కూడా చప్పగా ఉండేవి తినీ తినీ బోర్ కొట్టి స్పైసీ ఫుడ్ మీద మనసుపోతుంది. స్పైసీ ఫుడ్ టేస్టీగా ఉంటుంది..కానీ డైలీ తినడం మాత్రం హెల్తీ కాదు..!