ఆడపిల్లలందిరికీ వయసు కంటే తక్కువగా కనిపించాలని ఉంటుంది. ఇది అమ్మాయిల కామన్ కోరిక. కానీ వయసుపెరిగే కొద్ది బాధ్యతలు పెరుగుతాయి, వాటితో పాటు ఒత్తిడి, టెన్షన్, చికాకు ఇలా రకరకాల కారణాల వల్ల చర్మంపై ముడతలు వస్తాయి. కళ్లు లోతుకు పోయి పెద్దగా కనిపిస్తారు. ఎంత తెల్లగా ఉన్నా..కళ్లు లోతుగా వెళ్లిపోతే ఫేస్ లుక్కే మారిపోతుంది. వాటర్ సరిపడా తాగకున్నా ఇలా కళ్లు గుంటలు పడతాయి. ఈరోజు మనం ఈ సమస్యకు ఏ ఆహారంతో చెక్ పెట్టొచ్చో చూద్దామా..!
ఆకుకూరలు..
ఆకుకూరలు డైలీ తినడం చాలా మంచిది.. ముఖ్యంగా బచ్చలి, చుక్క కూరల్లో క్యాల్షియం, పొటాషియం, మాంగనీస్, భాస్వరం, ఎసి, బి-1, బి-2 విటమిన్లు ఉంటాయి. వీటిని తినడం వల్ల చర్మం. ఆరోగ్యంగా ఉంటుంది. ముడతలు రావు.
మామూలు ఆకుపచ్చటి క్యాప్సికంతో కూర చేసుకోవడం అందరికీ తెలుసు. ఎర్ర క్యాప్సికంను పెద్దగా ఉపయోగించం. కానీ అందులోనే సి-విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
బొప్పాయి పండులో సంపూర్ణ పోషకాహారం. ఇది చర్మం ముడతలు పడనీయదు. కంటి కింది చారలనూ తగ్గిస్తుంది.
వంగ రంగులో నిగనిగలాడుతూ ఈ సీజన్లో విరివిగా దొరికే..నేరేడుపళ్లు. ఎ సి- విటమిన్లు, ఆంథోసియానిన్ చర్మానికి నిగారింపు తెచ్చి ఆరోగ్యంగా ఉంచుతాయి.
బ్రకోలిలో విస్తారంగా ఉన్న సి. కెవిటమిన్, ఐరన్, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని సురక్షితంగా ఉంచుతాయి.
ఫ్రూట్స్‌లో ఉండే ప్రొటీన్లు గొప్ప శక్తినివ్వడమే కాదు, సూర్యతాపం వల్ల కలిగే చెడును నివారిస్తాయి. చర్మం ముడతలు పడకపోగా ప్రకాశిస్తుంది.
అవకాడో, క్యారెట్లలో విటమిన్లు అత్యధికంగా ఉంటుంది. ఇతర విటమిన్లు ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి టాక్సిన్స్‌ను నివారిస్తాయి. చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. కుడి కింద చారలేర్పడవు. స్కిన్ క్యాన్సర్‌ను కూడా నిరోదిస్తాయి.
మనం రోజూ ఇలాంటివి తింటుంటే యాంటీ ఏజెసింగ్ క్రిములు అవసరం లేకుండానే వయసును ఇట్టే దాచేయవచ్చు.
-Triveni Buskarowthu