జగన్ ఎక్కడ చదివాడో ఎవరికి తెలియదు : చంద్రబాబు

ఏపీలో తెలుగుదేశం పార్టీ నిర్వ‌హిస్తున్న మినీ మ‌హానాడుల్లో భాగంగా చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లెలో మినీ మ‌హానాడు బుధ‌వారం సాయంత్రం ప్రారంభ‌మైంది. ఈ స‌భ‌కు భారీ సంఖ్య‌లో టీడీపీ శ్రేణులు, ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యారు. అయితే ఈ కార్యక్రమంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను సాప్ట్ వేర్, టీచర్ ఉద్యోగాలు ఇప్పిస్తే… జగన్ వాలంటీర్‌ ఉద్యోగం ఇచ్చాడంటూ ఎద్దేవా చేశారు. అమ్మ ఓడి పేరుతో తల్లులను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. అంతేకాకుండా.. జగన్ ఎక్కడ చదివాడో ఎవరికి తెలియదు… మళ్ళీ ఇంగ్లీషు గురించి మాట్లాడుతాడంటూ విమర్శలు గుప్పించారు.

Coronavirus: Chandrababu Naidu Says COVID-19 Positive Andhra Pradesh  Headmaster Died Due To Hospital's Negligence

వైసీపీ నేతలు చెప్పగలరా… జగన్ ఎక్కడ చదివాడో… నేను ఎస్వీ యూనివర్శిటిలో ఎంఏ ఎకానామిక్స్ చదివాను అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమ్మ ఓడి ఒక నాటకం.. ఇంగ్లీషు మీడియాం ఓక భూటకమని ఆయన మండిపడ్డారు. పదో తరగతి పిల్లల ఆత్మహత్యలు…ప్రభుత్వ హత్యలు… వారి చేతగాతనం వల్లే అ మరణాలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో జగన్ ఎనిమిది వేల స్కూల్స్‌ మూసివేస్తున్నాడని, విద్యా వ్యవస్థ సర్వనాశనం చేస్తున్న ఘనత జగన్ కే దక్కిందంటూ విమర్శలు గుప్పించారు చంద్రబాబు..