గర్భవతులకు రాజ్మా గింజలు ఎంత మంచిదో.. బీపీ, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరమే లేదు..!

-

గర్భం వచ్చిన తర్వాత గైనకాలజిస్టును కలిసినప్పుడు డాక్టర్లు ఆ స్త్రీ ఎంత ఆరోగ్యంగా ఉన్నాసరే..కొన్ని మందులు వాడాలి అని ఇస్తుంటారు. అందులో ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్ పౌడర్ ఉంటాయి. గర్భవతులకు సహజంగా బీపీ వస్తుంటుంది. అది తగ్గడానికి కూడా ముందే మాత్రలు ఇస్తుంటారు. మలబద్ధకం సమస్య కూడా ఉంటుంది. దానికి కూడా కొన్ని పౌడర్లు లాంటివి ఇస్తారు. మరి ఇట్లా అనేక మాత్రలు, పౌడర్లు గర్భవతులు ఆ తొమ్మిది నెలలు వాడవల్సి వస్తుంది.

ఇది బిడ్డకు మంచిది కాదు. కానీ వాడాలి..సహజంగా కూడా ఇలాంటి లాభాలు అన్నీ పొందడానికి ప్రకృతి ప్రసాదించిన రాజ్మా గింజలను తీసుకుంటే..వారికి ఎన్నో లాభాలు కలుగుతాయి. ప్రతి గర్భవతి కచ్చితంగా తినవలసిన అతిముఖ్యమైన గింజల్లో రాజ్మా ఒకటి. ఇది సైంటిఫిక్ గా కూడా నిరూపించబడింది.

గర్భవతికి లోపల ఉండే శిశువు ఎదగాలి అంటే..కొత్తకణాలు పుట్టాలి. ఆ కణ నిర్మానానికి అతిముఖ్యమైన అవసరం ఫోలిక్ యాసిడ్. అందుకే వైద్యులు కచ్చితంగా ఈ టాబ్లెట్ ఇచ్చి ఇది వేసుకోపోతే నష్టం జరుగుతుంది అంటారు. ఫోలిక్ యాసిడ్ అందకపోతే నష్టం జరుగుతుంది..వేసుకోకపోతే కాదు. ఒకరోజుకు 400-800 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ గర్భవతికి కావాలి. ఆ నెలలను బట్టి ఎక్కువగా అవసరం అవుతుంది. అదే మాములు వారికి 400మైక్రోగ్రాములు సరిపోతుంది. ఈ ఫోలిక్ యాసిడ్ అనేది రాజ్మాగింజల్లో పెసర్లు, బొబ్బర్లు, శనగలకంటే కూడా డబుల్ ఉంది.

100 గ్రాముల రాజ్మా గింజల్లో 316 మైగ్రోగ్రామ్స్ ఫోలిక్ యాసిడ్ ఉంది. అందుకని గర్భవతులు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ వాడకుండా ఈ రాజ్మా గింజలను వాడుకోవడం చాలా మంచిది.

గర్భవతులకు సహజంగా మలబద్ధకం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తొలగించడానికి కూడా రాజ్మా గింజల్లో ఉన్న 16.5 గ్రాముల పీచు పదార్థం బాగా ఉపయోగపడుతుంది. మిల్లెట్స్ లో కంటే డబుల్ పీచుపదార్థం ఈ రాజ్మా గింజల్లో ఉంది.

100 గ్రాముల రాజ్మా గింజల్లో 20 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. గర్భవతికి ప్రొటీన్ అనేది 1కేజీ బరువుకు 2.5గ్రాముల చొప్పున కావాలి. హై ప్రొటీన్ డైట్ గర్భవుతులు ఎక్కువగా తినాలి. లేదంటే బిడ్డఎదుగుదల సరిగ్గా లేకుండా నష్టం జరిగే అవకాశం ఉంది. అలాంటిది ఈ రాజ్మా గింజల్లో 20 గ్రాములు ఉంది. మేకమాంసం తీసుకుంటే21 గ్రామలుు ప్రొటీన్ ఉంది. కానీ ధరలో రెండింటికి ఎంత వ్యత్యాసమో తెలుసుకదా.!ఖర్చుతక్కువలో ఎక్కువ ప్రొటీన్ ఇచ్చే బెస్ట్ గింజలు రాజ్మా.

ఇందులో ఉండే పొటాషియం 1324 మిల్లీగ్రాములు ఉంది. ఇది ఎక్కువ ఉండటంవల్ల గర్భవతులకు ఫ్లూయిడ్స్ అయి బ్లాలెన్స్ చేయడానికి బాగా పనికొస్తుంది. 2500మిల్లీగ్రాములు ఒకరోజుకు కావాలి. గర్భవతికి నీరు పట్టేస్తుందికదా..అది నియంత్రిండానికి కూడా ఇందులో ఉండే హై పొటాషియం ఉపయోగపడుతుంది.

గర్భవతులకు నెలల పెరిగేకొద్ది కాస్త బీపీ మొదలవుతుంది. హై బీపీను తగ్గించడానికి వైద్యులు ఇక బీపీ టాబ్లెట్ ఇస్తుంటారు. ఈ బీపీని నియంత్రించడానికి ఇందులో ఉండే హై పొటాషియం సహాయపడుతుంది.

ఇన్ని లాభాలు గర్భవతికి ఈ రాజ్మాగింజలు ద్వారా అందుతాయి. మరి ఇలాంటి రాజ్మాగింజలను గర్భవుతులు 12గంటలు నానపెట్టుకుని ఆపై కుక్కర్లో ఉడకపెట్టుకుని కూరల్లో వేసుకుని వండుకోండి. ఆకుకూరల్లో వాడుకోండి. అన్నం వడ్డేప్పుడు బియ్యంలో వేసేయండి. చక్కగా తినొచ్చు. శనగలు, బొబ్బర్లు తాలింపు పెట్టుకుని తింటారు కదా..అలా రాజ్మాను కూడా వేసుకుని తినొచ్చు. ఇలా వీలైనంత ఎక్కువగా వాడుకుంటే..గర్భవతులకు బాగా మంచిది.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news