ఓట్స్ తో రైస్ చేసుకుని తింటే ఎన్ని లాభాలో.. ముఖ్యంగా చంటిపిల్లలకు ఎంతో మేలు..!

-

బియ్యంతో అన్న వండుకుని తినటం మనకు అలవాటు..అరికెల అన్నం, రాగి అన్నం, సజ్జ అన్నం ఇలా రకరకాల వాటితే రైస్ చేసుకుని తినటం మనకు బాగా తెలుసు. వీటన్నింటిలో కల్లా..తేలిగ్గా డైజెషన్ అయి..వీటన్నింటికంటే ఎక్కువ ఫైబర్ ను, ప్రోటీన్ ను, ఎనర్జీను ఇచ్చే రైస్ ఒకటి ఉంది. అదే ఓట్స్ రైస్. ఓట్స్ ను అన్నం వండుకుని తినొచ్చని అసలు మనకు ఎప్పుడు ఆలోచన కూడా వచ్చి ఉండదు. పాలల్లో వేసుకుని తాగడం, ఉప్మా చేసుకోవటం మాత్రమే మనం ట్రే చేస్తుంటాం. అలాంటి ఓట్స్ ను అన్నం వండుకుని తింటే.ఎంతో బాగా ఉంటుంది. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. తేలిగ్గా డైజెషన్ అవుతుంది. ఓట్స్ రైస్ ఎలా తయారుచేసుకోవచ్చు, ఎవరు ఎవరు తినొచ్చు అనే విషయాన్ని ఈరోజు చూద్దాం.

ఓట్స్ అన్నాన్ని పాలు, నీళ్లు పోసీ వండుకుంటారు. పాలు, నీళ్లు కలిపి పోయ్యిమీద పెట్టి కాసేపు మరగనివ్వండి..ఆ తర్వాత ఓట్స్ వేయండి. మెత్తగా కావలంటే..ఎక్కువ సేపు ఉంచాలి. పొడిపొడిలాడుతూ ఉండాలంటే..తక్కవ వాటర్ పోయండి. కాసేపటికి తీసేయండి. పాలు ఎక్కువగా పోసి వండుకున్నప్పుడు మెత్తగా ఉంటుంది..దాన్ని తల్లిపాలు తాగేపిల్లకు, అన్నంప్రాసన తర్వాత లైట్ గా ఆహారం పెడుతుంతారు..7-8 నెలల పిల్లలకు పెట్టొచ్చు. అంత చిన్నచిన్న పిల్లలకు తెల్లటి పాలిష్ చేసిన బియ్యం పెడుతుంటారు. అది క్షమించరాని నేర చేసినట్లే..మీ పిల్లల భవిష్యత్తును చాలా చాలా పాడుచేస్తున్నట్లే..వింటానికి కష్టంగా ఉన్నా..తెల్లటి బియ్యం పెడటం తప్పే..మనమే వైట్ రైస్ తినటం మంచిది కాదు..అలాంటిది చంటిపిల్లలకు పెట్టడం మాహాపాపం..ఎలాంటి పోషకాలు ఉండపు, ప్రోటీన్ ఉండదు, ఫైబర్ అసలే ఉండదు. కేవలం పిండిపదార్ధాలు అంతే. వైట్ రైస్ మానేసి..ఓట్స్ రైస్ పెట్టండి.

తెల్లటి బియ్యంలో నాలుగు గ్రాముల ప్రొటీన్ కూడా ఉండదు. అదే ఓట్స్లో 11 గ్రాములు ఫైబర్ ఉంటుంది. 13 గ్రాములు మాంసకృతులు ఉంటాయి. మాములు రైస్ కంటే ఎన్నోరెట్లు ఎక్కువ.
బలం చూస్తే 380 కాలరీలు. కొవ్వులు 6.5 గ్రాములు. తేలిగ్గా డైజెషన్ అవుతుంది.

చంటిపిల్లలకు ఎంతో మంచిది. దంతాలు బాగా వచ్చేవరకూ…ఈ రైస్ పెట్టడం మంచిది. చిన్నపిల్లలు మోషన్ సరిగ్గా రాక..తెగ ఇబ్బందిపడుతుంటారు. అదే ఓట్స్ రైస్ అయితే..సుఖవిరోచనం అవుతుంది.పెద్దలకు కూడా..అప్పుడప్పుడు పొట్టబాగోనప్పుడు పొడిగా ఓట్స్ రైస్ చేసుకుని తినండి. తేలిగ్గా డైజెషన్ అవుతుంది. గుడ్ బాక్టిరియాలు బాగా పెరుగుతాయి. పుల్లపెరుగు వేసుకుని ఓట్స్ రైస్ వేసుకుని తింటే..చాలా బాగుంటుంది.

రోజు పుల్కాలు తినేవారు..ఎప్పుడైనా అన్నం తినాలనిపించినప్పుడు..ఓట్స్ రైస్ చేసుకుని తినొచ్చు. డైట్ లో ఉన్నప్పుడు చాలామందికి రైస్ తినాలని కోరిక ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఓట్స్ రైస్ తినటం వల్ల అన్నం తినాలన్నా కోరిక తీరుతుంది..మీ డైట్ కు కూడా ఎలాంటి సమస్యా ఉండదు.

ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి…పెద్దలకంటే ముఖ్యంగా చంటిపిల్లలకు ఓట్స్ రైస్ పెట్టడం అలవాటు చేయండి. పాలిష్ చేసిన బియ్యాన్ని ఎట్టిపరిస్థుతుల్లో పెట్టొద్దు. తెలియక, అలవాటైపోయి చాలామంది పిల్లలకు మనం తినే ఆహారమే పెడుతుంటారు. 1-2సంవత్సరాలు వచ్చేవరకూ పిల్లలకు అసలు వైట్ రైస్ ను పెట్టకూడదని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు అంటున్నారు. పెద్దలు కూడా తమ అవసరాలకు తగ్గట్టుగా వాడుకోవచ్చు.

డయాబెటిక్ పేషంట్స్ కూడా వైట్ రైస్ అసలు తినకూడదు. అలాంటివారు..ఓట్స్ రైస్ ను తినటం చాలా మంచిది. కడుపునిండా తినటం ముఖ్యం కాదు..పోషకవిలువలతో తినటం ముఖ్యం కాబట్టి వీలైనంత వరకూ మీ ప్లేట్ పోషకాలతో ఉండేలా చూసుకోవటం అందరి బాధ్యత. వారానికి ఒకసారి వైట్ రైస్ తింటూ మిగిలిన డేస్ లో ఇలాంటి పోషకాలు ఉన్న డైట్ ఫాలో అయితే..ఎలాంటి సమస్యలు దరిచేరవు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version