దంతాల వెనుక భాగంలో ఉన్న అసహ్యకరమైన పసుపు మరకలను వదిలించుకోవాలా? అదికూడా ఒక్కవారంలోనే..

-

అందం అనేది చిరునవ్వులోనే కనిపిస్తుంది. అవతల మనిషి సంతోషంగా ఉన్నాడా? మూడీగా ఉన్నారో చిరునవ్వులో కనిపిస్తుంది. అన్ని సందేశాలనిచ్చే చిరునవ్వుకు కారణమైన దంతాలు పసుపుపచ్చగా ఉంటే ఆ నవ్వుకు అర్థం ఉంటుందా.. అదే ఆ నవ్వు వెనుక అందమైన దంత వరుస ఒక స్పార్క్‌లా మెరుస్తుంటే ఆ అందం పదింతలు రెట్టింపు అవుతుంది. మరి దంతాలను శుభ్రంగా, తెల్లగా ఉంచేందుకు కొన్ని పద్ధతులున్నాయి. అవేంటో తెలుసుకోండి.

దంతాలు తెల్లగా ఉంచేందుకు టిప్ :
కావాల్సినవి :
బేకింగ్‌సోడా : 2 టేబుల్‌స్పూన్
నిమ్మరసం : 1 టేబుల్‌స్పూన్
టూత్‌పేస్ట్ : 1 టేబుల్‌స్పూన్
ఆపిల్ సైడర్ వెనిగర్ : 1 టేబుల్‌స్పూన్
కొబ్బరినూనె : 1 టేబుల్‌స్పూన్
అల్యూమినియం రేకు

తయారీ :
– గిన్నెలో బేకింగ్ సోడా, టూత్‌పేస్ట్ కలుపాలి.
– తర్వాత దీన్ని నిమ్మరసం, ఆపిల్ సైడర్ వెనిగర్ కలుపాలి. తర్వాత కొబ్బరినూనె వేసి బాగా కలుపాలి.
– రెండు ముక్కలు అల్యూమినియం రేకులు తీసుకొని వాటిపై విడివిడిగా ఒక్కొక్క టీస్పూన్ వేసి రేకుమొత్తం సర్ది రాయండి. అప్పుడు ఒక అల్యూమినియం భాగాన్ని ఎగువ దంతాలపై మరొకటి దిగువ దంతాలపై ఉంచాలి.
– 2 నిమిషాల తర్వాత అల్యూమినియం రేకును తీసి నీటితో నోటిని పుక్కిలించుకోవాలి.
– మిగిలిన మిశ్రమంతో మీ చేతివేళ్లలో లేదా బ్రష్‌తో పళ్ళు తోముకొని నీటితో నోరు పుక్కిలించండి. ఈ మిశ్రమం సిద్ధమైన తర్వాత వెంటనే వాడాలి. దీన్ని మళ్లీ ఉపయోగించకూడదు.

గమనిక :
ఈ పద్ధతిని వారానికి రెండుసార్లు మాత్రమే వాడాలి. ఇలా చేస్తే మాత్రం దంతాల వెనుక భాగంలో ఉన్న పసుపు మరకలు, గార మాయమవుతాయి. దంతాలు తెల్లగా ఎలాంటి మరకలు లేకుండా నోరు శుభ్రంగా ఉంటుంది.

బేకింగ్‌సోడా :
బేకింగ్ సోడా యాంటీ బ్యాక్టీరియల్ పదార్థం. ఇది నోటిలోని బ్యాక్టీరియాను చంపుతుంది. బేకింగ్ సోడా దంతాలను తెల్లగా చేస్తుంది. బేకింగ్ సోడా వాడడానికి ఇష్టపడని వారు దానికి బదులుగా నిమ్మరసం వాడవచ్చు.

నిమ్మరసం : ఈ పద్ధతిలో ఉపయోగించే నిమ్మరంస బ్లీచింగ్ లాగా పనిచేస్తుంది. ఇది యంటీ బాక్టీరియల్ లక్షణాలను చంపుతుంది. అంతేకాకుండా మీ దంతాలను పసుపురంగులో లేకుండా ఉంచుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ :
ఈ పద్ధతి చాలా ఎఫెక్టివ్‌గా ఉండడానికి మరొకా కారణం ఆపిల్ సైడర్ వెనిగర్. దీనిలోని ఆమ్లత్వం దంతాలపై పసుపు మరకలను తొలిగించడానికి సహాయపడుతుంది. దీన్ని టేబుల్‌స్పూన్ కంటే ఎక్కువ వాడకూడదు.

కొబ్బరినూనె :
ఇది దంత క్షయం నివారించడానికి మరియు చిగుళ్ళను పోషించడానికి, చిగుళ్ల వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు ఈ విధంగా కొబ్బరినూనెను ఉపయోగించడమే కాదు దీంతో నోరు పుక్కిలించడం వల్ల చిగుళ్లు మెత్తబడి, నోటి సమస్యలు నయం అవుతాయి.

టూత్‌పేస్ట్ :
ఈ పద్ధతిలో టూత్‌పేస్ట్‌ను ఉపయోగించడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. టూత్‌పేస్ట్ ప్లాట్‌ఫామ్‌లాగా పనిచేస్తుంది. ఈ పద్ధతి కోసం ప్రధానంగా వైట్ టూత్‌పేస్ట్ ఉపయోగపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news