ఇలా చేస్తే వానాకాలంలో అనారోగ్య సమస్యలు వుండవు..!

సాధారణంగా వానా కాలంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. జలుబు, దగ్గు, ఫ్లూ మొదలు టైఫాయిడ్, మలేరియా ఇలా ఎన్నో వ్యాధులు వ్యాపిస్తుంటాయి. ఇటువంటివి కలగకుండా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవడం ముఖ్యం.

మనం తీసుకునే ఆహారం బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. పైగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే జబ్బులు ఉండవు. వానా కాలంలో ఈ జ్యూస్ ని తీసుకుంటే చక్కగా ఆరోగ్యంగా ఉండొచ్చు అయితే అందులో ఐస్ వేసుకోకండి మరియు
దానిని ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోకండి.

క్యారెట్ జ్యూస్:

క్యారెట్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది క్యారెట్ ని ఆవిరిపై ఉడికించి చల్లార్చి పెట్టుకుని.. దానిలో టమాటా, ఆపిల్ ని వేసి జ్యూస్ చేసుకోండి. ఇలా జ్యూస్ చేసుకుని తీసుకుంటే ఇమ్యూనిటీ వస్తుంది.

అలానే వానాకాలంలో అనారోగ్య సమస్యలు మీ దరిచేరవు. పుదీనా ఆకులు కూడా ఇందులో బ్లెండ్ చేసి బ్రేక్ఫాస్ట్ సమయంలో దీనిని తీసుకోవచ్చు లేదంటే సాయంత్రం అయినా తీసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఇది మీకు హెల్ప్ అవుతుంది అలానే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యంగా ఉండటానికి ఇది హెల్ప్ అవుతుంది. అలానే వానా కాలంలో అల్లం, వెల్లుల్లి, నట్స్, డ్రై ఫ్రూప్ట్స్, కాకరకాయ, నిమ్మ, పెరుగు, బట్టర్ మిల్క్ వంటివి ఎక్కువ వాడితే కూడా మంచిది.