బాదం నూనె ఉపయోగిస్తే నిత్యం యవ్వనమైన స్కిన్ మీ సొంతం.. ఇంకా ఈ బెనిఫిట్స్ అన్నీ..

-

బాదంపప్పు తింటే ఆరోగ్యానికి ఎంత మేలో మనందరికి తెలుసు..చక్కగా నానపెట్టుకుని డైలీ తింటే..ఆరోగ్యానికి చాలా మంచిది. బాదంనూనెలో బెనిఫిట్స్ గురించి ఎప్పుడైనా విన్నారా..ఇది చర్మసమస్యలకు చక్కగా పనిచేస్తుంది. పురాతన కాలం నుండి ఆయుర్వేద ఔషధాలలో బాదం నూనె ఉపయోగించేవారు. బాదం నూనె చర్మ సమస్యలను దూరం చేయడంలో చాలా మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా.. మెరిసేలా చేస్తుంది. బాదంపప్పులో విటమిన్ ఎ, ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ , జింక్‌లు అద్భుతంగా ఉన్నాయి. బాదం నూనె వల్ల కలిగే బ్యూటీ బెనిఫిట్స్ ఏంటో ఓసారి చూద్దాం..

కళ్ల కింద ఉబ్బడం, నల్లటి వలయాలను తగ్గిస్తుంది :

బాదం ఆయిల్ కళ్ల కింద నల్లటి వలయాలను , కళ్ల కింద ఉబ్బును తగ్గిస్తుంది. ఆల్మండ్ ఆయిల్ స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది. పొడి చర్మానికి ఇది ఉత్తమ చికిత్స. చేతులతో ప్రతిరోజూ కళ్ల కింద మసాజ్ చేయడం వల్ల నల్లటి వలయాలు పోతాయి.

శిరోజాలకు చికిత్స చేస్తుంది :

శీతాకాలంలో, తల చర్మం కూడా పొడిగా మారుతుంది, దీని కారణంగా జుట్టులో చుండ్రు సమస్య పెరుగుతుంది..బాదం నూనె చుండ్రును నివారించడంలో.. శిరోజాలను ఆరోగ్యంగా మార్చడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వారానికి ఒకసారి ఈ నూనెతో మీ జుట్టుకు మసాజ్ చేస్తుంటే జుట్టు సమస్యలు కూడా ఉండవు

ముడతలను తొలగిస్తుంది :

బాదం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉండటంతో..చర్మంపై ముడతలను తొలగిస్తుంది. రాత్రి పడుకునే ముందు బాదం నూనెను ముఖానికి పట్టించి పొడుకుంటే సరి..

మొటిమలను తొలగిస్తుంది:

బాదం నూనెలో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి, ఇవి చర్మంపై ఉన్న అదనపు నూనెను తగ్గించడంలో సహాయపడతాయి. నూనెలో ఉండే రెటినాయిడ్స్ మొటిమలను తగ్గిస్తాయి.

సూర్యుని హానికరమైన కిరణాల నుండి రక్షిస్తుంది:

జంతువులపై చేసిన అధ్యయనాలు బాదం నూనెలో ఉండే విటమిన్ ఇ, సూర్యుని హానికరమైన కిరణాల నుండి రక్షిస్తుందని తేలింది.

మచ్చలను తొలగిస్తుంది:

బాదం నూనెను మచ్చలను తగ్గించడానికి కూడా ఉపయోగించబడింది. విటమిన్ ఇ చర్మాన్ని మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది.

చర్మాన్ని తేమ చేస్తుంది:

చర్మం పొడిగా ఉంటే బాదం నూనెను ఉపయోగించుకోవచ్చు.. ఈ నూనె చర్మం ఎరుపు , చికాకును తగ్గిస్తుందట. ఇది చర్మంలోని తేమను నిలుపుకోవడంతోపాటు చర్మానికి మంచి పోషణను అందిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news