రాత్రి నిద్ర బాగా పట్టాలంటే… ఇలా చెయ్యండి..!

-

చాలామందికి రాత్రిపూట ఎక్కువగా నిద్ర పట్టదు. మంచి నిద్ర కోసం ఎంత ప్రయత్నం చేసినా నిద్ర రాదు సరి కదా ఎంతో ఇబ్బందిగా ఉంటుంది నిజానికి ఆరోగ్యంగా ఉండేందుకు నిద్ర కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మనం మంచిగా నిద్రపోతేనే మన ఆరోగ్యం బాగుంటుంది లేకపోతే అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకు కూడా ఎక్కువగా నిద్ర పట్టదా అయితే కచ్చితంగా మీరు ఈ చిట్కా ని ట్రై చేయాల్సిందే. ఈ చిట్కా ని పాటిస్తే చక్కగా నిద్రపోవచ్చు.

మంచి నిద్రని పొందడానికి ధనియాలు బాగా సహాయపడతాయి ధనియాలు తీసుకుంటే చక్కగా నిద్రపోవచ్చు. దీని కోసం మీరు ఒక గ్లాసు నీళ్ల లో టీ స్పూన్ ధనియాలని వేసి మరిగించండి తర్వాత వడకట్టేసి ఆ నీటిని తాగేయండి. ధనియాల ని మీరు నానబెట్టేసి ఆ నీటిని తాగినా కూడా చక్కటి ఫలితాన్ని పొందొచ్చు.

రోజూ పడుకునే ముందు ఇలా తీసుకోండి అప్పుడు మీకు మంచి నిద్ర పడుతుంది అలానే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఒత్తిడి దూరం అయిపోతుంది. రాత్రిపూట నిద్ర పట్టకపోతున్నట్లయితే ఎక్కువ ఆహారాన్ని రాత్రి పూట తీసుకోవద్దు. ఎక్కువ ఆహారం తీసుకోవడం వలన అసౌకర్యంగా ఉంటుంది అలానే అజీర్తి సమస్యని ఎదుర్కోవాల్సి వస్తుంది.

నిద్ర పట్టకపోయినట్లయితే కెఫీన్ ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండండి. నిద్ర పట్టే ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా నిద్రపోవచ్చు. కివి, పాలు, బాదం వంటివి తీసుకుంటే నిద్ర పడుతుంది. ఇలా ఈ విధంగా మీరు అనుసరిస్తే మంచి నిద్రని పొందొచ్చు ఏ సమస్య లేకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు కూడా.

Read more RELATED
Recommended to you

Latest news