అగరబత్తి పొగతో క్యాన్సర్ ముప్పు..సిగిరెట్ పొగకంటే ఎక్కువ హానికరమట..!

హిందువులకు ఉదయం లేవగానే పూజలు చేసి అగరబత్తి వెలిగించటం ఒక అలవాటు. ఇంకా చాలా షాప్స్ లో కూడా మనం చూసే ఉంటాం. ఓపెన్ చేసిన వెంటనే పూజచేసి దేవుడికి అగరబత్తి వెలిగిస్తారు. కమ్మని వాసనకు మైండ్ అంతా ఒక ఆధ్యాత్మిక ధోరణిలోకి వెళ్తుందని ఫీల్ అ‌వుతుంటారు. ఇంకా ఈ అగరబత్తకి వచ్చే యాడ్స్ కూడా స్మెల్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తాయి. ముక్కులు పగిలిపోయేలా గట్టిగా వాసన పీలుస్తాంటారా యాడ్స్ లో.
కొంతమందికి ఈ అగరబత్తి వాసన అస్సలు నచ్చుదు. ఆ వాసన పీల్చగానే ఒకరకమైనా చిరాకు, ఇబ్బంది కలుగుతుంది. వెంటనే తలనొప్పి కూడా వచ్చినట్లు అనిపిస్తుంది. ఇలా ఉంది అని మనం బయటకుచెప్తే పెద్దగా ఎవరూ నమ్మరూ..మీరీ ఓవర్ యాక్షన్ అగరబత్తి పొగకే ఇంత చేస్తున్నావా అంటారు. కానీ పాపం వారు చెప్పేది నిజమే. ఎ‌వరికైతే అగరబత్తి పొగ చాలా త్వరగా ఎఫెక్ట్ చూపిస్తుందో…అలాంటివారు ఆ పొగకు దూరంగా ఉంటేనే మంచింది. మామూలు వారికంటే అలాంటివారే త్వరగా దీనవల్ల వచ్చే నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అగరబత్తి వాసన వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా.
జనరల్ గా సిగిరెట్ తాగేవాడికంటే..అది పక్కన ఉండి పీల్చేవాడికి కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అంటారు. అంత కంటే ఎక్కువ ఎఫెక్ట్ అ‌వుతందంట అగరబత్తి పొగ. పరిశోధకులే ఈ ‌విషయాన్ని వెల్లడించారు. సిగిరెట్ పొగ కంటే అగరబతత్తి పొగ ఎక్కువ ఆరోగ్యానికి హానికరం అంటున్నారు.
అగరబత్తీలు వెలిగిస్తే.. వచ్చే పొగ నుంచి చిన్న చిన్న పరిమాణంలోని అణువులు గాల్లోకి వ్యాపిస్తాయి. అవి కణాల స్థాయిలో లోపలికి వెళ్లి.. శరీరానికి హాని చేస్తాయిని 2015 నాటి చైనీస్ అధ్యయనం పేర్కొంది.
ఈ పొగలో ఉండే మూడు రకాల ట్యాక్సిన్లు కొన్ని సందర్భాల్లో కేన్సర్‌కు దారి తీస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. మ్యూటాజెనిక్, జెనోటాక్సిక్, సైటోటాక్సిక్ అనే మూడు రకాల ట్యాక్సిన్లు జన్యుపరమైన మార్పులకు కారణం అవుతాయని పరిశోధకులు పదే పదే హెచ్చరిస్తున్నారు. దీని వల్ల డీఎన్ఏ మార్పులకు లోనవుతుందని, ఇది మంచి సంకేతం కాదని చెప్తున్నారు.
అగరబత్తుల పొగ ఊపిరితిత్తుల్లోకి చేరి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ఈ పొగలోని కణాల్లో 64 సమ్మేళనాలు వాయునాళంలో ఇబ్బందికి, ఇరిటేషన్‌కు కారణం అవుతాయి. అగరబత్తుల్లోని ఎక్స్‌ట్రా ఫైన్ పార్టికల్స్ శరీరానికి హానికరం. కృతిమ పరిమళాలు మరింత నష్టానికి కారణం అవుతాయట.
వామ్మో అగరబత్తితో ఇంత అనర్థం ఉందా..అసలు ఈ విషయం ఇప్పటివరకూ ఎంతమందికి తెలుసో. దేవుడిపై భక్తి పేరుతో మనమే మన ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నవాళ్లమవుతాం..ఇప్పటికైనా మీలో ఎవరైనా అగరబత్తిలు ఎక్కువ వాడేవారు ఉంటే..వాటి వాడకం తగ్గించటం మేలు.
– Triveni Buskarowthu