ఒక నెలలో 10కిలోలు బరువు తగ్గడం మంచిదేనా? పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారు?

-

మహమ్మారి కారణంగా వచ్చిన చాలా సమస్యల్లో బరువు పెరగడం కూడా ఒకటి. బయటకు వెళ్ళకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, రొటీన్ జీవితం దెబ్బతినడం కారణంగా అనవసరమైన వాటిని తినడం మొదలుపెట్టడంతో బరువు పెరగడం అనే సమస్య వచ్చింది. ఇప్పుడు ఆ బరువును తగ్గించడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నిజానికి బరువు తగ్గడం అనేది పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే బరువు పెరిగినంత సులభంగా బరువు తగ్గలేరు. దానికోసం కొంత శ్రమ పడాలి.

అదీగా ఎంత శ్రమపడినా కూడా కొందరు బరువు తగ్గరు. దానికి రకరకాల కారణాలు ఉండవచ్చు. అదలా ఉంచితే, ఏకకాలంలో అమాంతం బరువు తగ్గడం మంచిదేనా కాదా అన్నది ఇక్కడ తెలుసుకుందాం. ఉదాహరణకి ఒక నెలలో 10కిలోల బరువు తగ్గడం సరైన పనేనా? లేదా దానివల్ల ఏదైనా ఇబ్బందులు కలుగుతాయా? అన్నది చూద్దాం.

పోషకాహార నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఒకే నెలలో ఎక్కువ బరువు తగ్గాలనుకోవడం సరైన పని కాదు. 10కిలోల బరువు ఒకే నెలలో తగ్గడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. దానిక్కారణం ఈ విధంగా ఉంది. బరువు తగ్గాలన్న ఆకాంక్షతో మీ కడుపును ఎండబెట్టి నోటికి తాళం వేసేస్తుంటారు. దానివల్ల బరువు తగ్గినా కూడా ఆ తర్వాత తీసుకునే ఆహారం వల్ల మళ్లీ రెట్టింపు బరువు పెరిగే అవకాశం ఉంది. అందుకే కొంతమంది అమాంతం బరువు తగ్గినట్లుగా కనిపించి, ఆ తర్వాత చాలా ఎక్కువ బరువు పెరుగుతారు. అందుకే నిదానమే ప్రధానం అన్నది గుర్తుంచుకోవాలి.

మరో విషయం, బరువు తగ్గడానికి ఎక్కువ సేపు వ్యాయామం చేయాలా అన్న సందేహం కలుగుతుంటుంది.

దీనికి సమాధానంగా అలా అవసరం లేదనే చెబుతున్నారు. రోజులో 45నిమిషాల నుండి గంటపాటు చాలు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news