బీట్‌రూట్‌ జ్యూస్‌ రోజు తాగితే ప్రమాదమా..? నిపుణులు ఏం అంటున్నారు..?

-

బీట్‌రూట్‌ జ్యూస్‌: ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో బీట్‌ రూట్‌ కూడా ఒకటి.. కొంతమంది బీట్‌రూట్‌ను కూరల్లో వాడుతుంటారు. మరికొంతమంది డైలీ జ్యూస్‌ చేసుకుని తాగుతారు. బీట్‌రూట్‌ను వాడితే.. అందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. అయితే బీట్ రూట్‌ను రోజూ తింటే హానిక‌ర‌మా ? రోజూ బీట్ రూట్‌ను తిన‌వ‌చ్చా? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి.. కొంతమంది డైలీ బీట్‌ రూట్‌ జ్యూస్‌ తాగితే..కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి అని కూడా నమ్ముతున్నారు.. ఇందుకు నిపుణులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారో చూద్దామా..!

బీట్‌రూట్‌ను రోజూ తిన‌వ‌చ్చు. ఇది పూర్తిగా సుర‌క్షితమే. అయితే బీట్‌రూట్‌ను నేరుగా తింటే రోజూ ఒక క‌ప్పు మోతాదులోనే తినాలి..అదే జ్యూస్ అయితే ఒక గ్లాస్ మేర తాగ‌వ‌చ్చు. ఈ విధంగా రోజూ బీట్‌రూట్‌ను నిర్భ‌యంగా తీసుకోవ‌చ్చు. దీంతో ఎలాంటి దుష్ప‌రిణామాలు ఏర్ప‌డ‌వట… బీట్‌రూట్‌ను రోజూ తీసుకోవడం వ‌ల్ల అనేక లాభాలు పొంద‌వ‌చ్చు. ఇందులో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. జీర్ణ‌క్రియ సాఫీగా జ‌రుగుతుంది. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌లు ఉండ‌వు.

బీట్‌రూట్‌లో విట‌మిన్ బి9 లేదా ఫోలేట్ అధికంగా ఉంటుంది. ఇది గ‌ర్భిణీలకు ఎంత‌గానో మేలు చేస్తుంది. బిడ్డ ఎదుగుద‌ల‌కు ఇది స‌హాయ‌ప‌డుతుంది. బీట్‌రూట్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌) త‌గ్గి మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. బీపీ త‌గ్గుతుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు.

అయితే బీట్‌రూట్‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల కొంద‌రికి అల‌ర్జీ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అలాంటి వారు దీన్ని తీసుకోక‌పోవ‌డ‌మే మంచిది. ఒకవేళ మీకు ఎలాంటి అలర్జేలు రాకుండా ఉంటే మాత్రం హ్యాపీగా బీట్‌రూట్‌ను వాడుకోవచ్చు.. ఎలాంటి సమస్యా లేదు. బీట్‌రూట్‌ వాడితే.. వారం రోజులలోనే మీరు ఊహించని మార్పులు మీ ముఖంలో కనిపిస్తాయి.. ఫేస్ మంచి గ్లో వస్తుంది. హెయిర్‌ బాగుంటుంది. డైజెషన్‌ సమస్య ఉండదు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version