ఈటల-కొండా-కోమటిరెడ్డి..కాంబినేషన్‌కు కేసీఆర్ చెక్.!

-

నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ గెలవడం కోసం కే‌సి‌ఆర్ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ముచ్చటగా మూడోసారి గెలిచి సత్తా చాటాలని కే‌సి‌ఆర్ భావిస్తున్నారు. ఎక్కడ ప్రతిపక్షాలకు అవకాశం కూడా ఇవ్వకూడదని చూస్తున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షల్లో బలమైన నాయకులని నిలువరించాలని కే‌సి‌ఆర్ ప్లాన్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో అదేవిధంగా ప్లాన్ చేసి బలమైన ప్రత్యర్ధులకు చెక్ పెట్టి విజయం సాధించారు. ఇప్పుడు అదేవిధంగా సత్తా చాటాలని చూస్తున్నారు.

ఇప్పటికే కీలకమైన నేతలపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో బి‌జే‌పిలో ఉన్న బలమైన నేతలపై ఈ సారి గట్టిగానే ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ప్రజాదరణ వారిని ఓడించడానికి వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకెళుతున్నారు. ఇందులో బి‌జే‌పిలో మొదట నుంచి ఉంటున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లని పక్కన పెడితే..కొత్తగా పార్టీలోకి వచ్చిన ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వారికి చెక్ పెట్టాలని చూస్తున్నారు. వీరు తమ స్థానాలతో పాటు కొన్ని స్థానాల్లో గెలుపోటములని ప్రభావితం చేయగల సత్తా ఉంది.

అందుకే వీరిని నిలువరించడానికి ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎలాగో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కొండాని చేవెళ్ళ పార్లమెంట్ లో ఓడించారు. ఇక కాంగ్రెస్ ని వదిలి బి‌జే‌పిలో చేరి మునుగోడు బరిలో మళ్ళీ దిగిన కోమటిరెడ్డిని ఓడించారు. కానీ బి‌ఆర్‌ఎస్ నుంచి బి‌జే‌పిలోకి వచ్చిన ఈటలని హుజూరాబాద్‌లో ఓడించలేకపోయారు.

కానీ ఈ సారి మాత్రం ఈటలని ఓడించాలని గట్టిగా ట్రై చేస్తున్నారు. ఇప్పటికే హుజూరాబాద్ అభ్యర్ధిగా కౌశిక్ రెడ్డిని ప్రకటించారు. ఇటు కోమటిరెడ్డిని మళ్ళీ ఓడించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సారి కొండా ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ఆయన్ని కూడా నిలువరించాలని చూస్తున్నారు. చూడాలి మరి ఈ బడా నేతలకు కే‌సి‌ఆర్ ఎలా చెక్ పెడతారో.

Read more RELATED
Recommended to you

Latest news