నోటి ఆరోగ్యాన్ని విస్మరించే వారు నమ్మలేని నిజాలు.. ఇప్పుడే తెలుసుకోండి.

-

శరీర ఆరోగ్యం గురించి ఆలోచించే వారు నోటి ఆరోగ్యం గురించి తప్పక ఆలోచించాలి. నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే అది శరీర ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే నోటి గురించి శ్రద్ధ తీసుకోవాలి. రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవడం సహా సంవత్సరానికి ఒకసారి దంత వైద్యుడిని సంప్రదించడం చాలా ఉత్తమం. ప్రస్తుతం నోటి ఆరోగ్యాన్ని విస్మరిస్తే వచ్చే ఇబ్బందులేమిటో ఇక్కడ తెలుసుకుందాం.

నాలుకను శుభ్రం చేసుకోకపోవడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో దాదాపు 230కోట్ల మంది పళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. పళ్ళ గురించి పెద్దగా పట్టించుకోకపోవడమే దీనికి ముఖ్య కారణమని ఆ నివేదిక సారాంశం.

అందుకే దంత వైద్యుడిని క్రమం తప్పకుండా సంప్రదించి నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల కలిగే అనర్థాలు

దంతాల గురించి పెద్దగా పట్టించుకోకుండా ఉంటే వాటిపై అనవసర బాక్టీరియా పెరుగుతుంది. ఈ బాక్టీరియా ఎక్కువ రోజులు దంతాల మీద ఉన్నట్లయితే పళ్ళు విరిగిపోయే లేదా ఊడిపోయే పరిస్థితి వస్తుంది.

ఈ బాక్టీరియా మూలంగా కేవిటీస్ వస్తాయి. ఈ కేవిటీలు చాలా తక్కువగా ఉన్నప్పుడే వైద్యుడిని సంప్రదించాలి.

బాక్టీరియా మూలంగా పళ్ళ మంద సందులు ఏర్పడతాయి. అవి మీ నవ్వుకు ప్రతిబంధకంగా మారతాయి. దానివల్ల మీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అంతేకాదు నోటి నుండి దుర్వాసన వచ్చే అవకాశమూ ఉంది.

ఇంకా నోటిలోని బాక్టీరియా పెరిగి పెరిగి క్యాన్సర్ కు దారి తీయవచ్చు. నోటీ క్యాన్సర్ కు ఇది మూలకారణంగా ఉండే అవకాశమూ ఉంది. కాబట్టి నోరే కదా అని తేలికగా తీసిపారేయద్దు.

Read more RELATED
Recommended to you

Latest news