యాభై ఏళ్ళు దాటిన పురుషులు కచ్చితంగా వీటిని తీసుకోవాలి..!

-

యాభై ఏళ్ళు: మీ వయసు 50 దాటాయా..? అయితే పురుషులూ కచ్చితంగా ఈ విషయాలను మీరు తెలుసుకోవాలి చాలా మంది పురుషులు ఆరోగ్యం పై శ్రద్ధ వహించరు. అయితే నిజానికి ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉంటేనే జీవితం బాగుంటుంది పురుషులు ఆరోగ్యంగా ఉండాలన్నా ఆరోగ్యకరమైన పద్ధతుల్ని అనుసరించాలన్నా వీటిని తప్పకుండా అనుసరించాలి. 50 ఏళ్లు దాటినా పురుషులు వాళ్ళ యొక్క సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి చిట్కాలని ఉపయోగిస్తే ఆరోగ్యం బాగుంటుంది. పైగా బలంగా ఉంటారు. పసుపు, అల్లం వంటి వాటిలో యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది.

అలానే వీటిని కూడా డైట్ లో తీసుకుంటే పురుషుల ఆరోగ్యం బాగుంటుంది 50 ఏళ్లు దాటిన పురుషులు కచ్చితంగా పప్పుని డైట్ లో తీసుకుంటూ ఉండాలి. పప్పులో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కండరాల ఆరోగ్యానికి కూడా పప్పు బాగా హెల్ప్ అవుతుంది. వయసు పెరిగే కొద్దీ పురుషులు లో కండరాల బరువు తగ్గుతూ ఉంటుంది అయితే పప్పు తీసుకోవడం వలన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది ఐరన్ కూడా పప్పులో ఉంటుంది దీనితో ఎనీమియా సమస్య ఉండదు.

50 ఏళ్ళు దాటిన వాళ్ళు రైతా తీసుకోవడం కూడా మంచిది ఇందులో ప్రోబయోటిక్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అజీర్తి సమస్యలు ఉండవు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో క్యాల్షియం ఎముకలను దృఢంగా చేస్తుంది ఇలా పోషక పదార్థాలని రైతా తో కూడా పొందొచ్చు. కాబట్టి రైతాని కూడా డైట్ లో మగవాళ్ళు తీసుకోవడం మంచిది.

చపాతిని తీసుకుంటే కూడా మగవాళ్ళకి ఎంతో మేలు కలుగుతుంది కార్బోహైడ్రేట్స్ ఇందులో ఎక్కువ ఉంటాయి. ఎనర్జీ ప్రొడక్షన్ బాగుంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. పసుపు వెల్లుల్లి వంటి వాటిని కూరల్లో వాడితే చాలా మేలు కలుగుతుంది. ఇమ్యూనిటీ పెంచుకోవడమే కాకుండా వివిధ ప్రయోజనాలను పొందవచ్చు.

యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు కూడా వీటిలో ఉంటాయి. సో శనగలు కూడా తీసుకోవచ్చు శనగలు లో ప్రోటీన్ ఫైబర్ ఉంటాయి అలానే విటమిన్స్ మినరల్స్ కూడా ఉంటాయి కాబట్టి శనగలను కూడా 50 ఏళ్ల దాటిన పురుషులు తీసుకోవచ్చు. అయితే 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి కాస్త జీర్ణం తక్కువగా ఉంటుంది అలాంటప్పుడు లిమిట్ గా తీసుకోవాలి అతిగా ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news