రాత్రిపూట నిద్ర సరిగ్గా పట్టడం లేదా…? అయితే ఈ ఇంటి చిట్కాలు పాటించాల్సిందే..!

-

చాలామంది రాత్రిపూట నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు నిద్ర పట్టకపోతే ఈ ఇంటి చిట్కాలు చాలా చక్కగా పనిచేస్తాయి. వీటిని అనుసరించడం వలన నిద్ర బాగా పడుతుంది ఎలాంటి ఇబ్బందులు కలగవు. రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చటి పాలు తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది నిద్ర పట్టకపోయినట్లయితే రోజూ రాత్రి పడుకునే ముందు గోరువెచ్చటి పాలు తాగుతూ ఉండండి అప్పుడు మంచిగా నిద్ర పడుతుంది.

చమోమిలే టీ తీసుకుంటే కూడా రాత్రి పూట నిద్ర బాగా పడుతుంది. నిద్ర పట్టని వాళ్ళు ఈ టీ ని తీసుకుంటే బాగా నిద్ర పడుతుంది. బాదంని కూడా తీసుకుంటూ ఉండండి. నిద్రపోయే ముందు బాదం తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది, రాత్రిపూట నిద్ర బాగా పట్టాలంటే గది చల్లగా ఉండాలి డార్క్ గా ఉండాలి. చీకటిగా ఉండేటట్టు చూసుకోండి. లైట్ లు అన్నీ కూడా ఆపేయండి నొప్పి ఒత్తిడి ఆస్తమా గుండెలో మంట నిద్రలేమీ సమస్యలు వలన రాత్రి పూట నిద్ర పట్టదు.
అలానే టీ కాఫీ సోడా వంటివి తీసుకుంటే కూడా నిద్ర పట్టదు. కొన్ని మందులని రాత్రిపూట వేసుకోవడం వల్ల కూడా నిద్ర బాగా పట్టదు. డ్రగ్స్, ఆల్కహాల్ వంటివి తీసుకున్నా కూడా నిద్ర పట్టదు.

సరైన నిద్ర లేదని ఎలా చెప్పొచ్చు..?

వర్క్ చేయడంలో ఫోకస్ తగ్గితే మీరు గ్రహించాలి. ఏకాగ్రతని పెట్టలేకపోతుంటే కూడా నిద్ర సరిగా పట్టలేదని గ్రహించాలి.
నిద్ర సరిగ్గా లేదంటే ఎక్కువగా గురక వస్తూ ఉంటుంది.
ఉదయం పూట నిద్ర ఎక్కువ పడుతున్నా కూడా రాత్రి నిద్ర సరిగా పట్టలేదని మనం చెప్పొచ్చు. మంచి స్లీపింగ్ పేటర్న్ ని మీరు డెవలప్ చేసుకుంటే నిద్ర బాగా పడుతుంది. రోజూ ఒకే టైం కి పడుకోవడం ఒకే టైం కి లేవడం చేస్తే మంచి నిద్రను పొందొచ్చు. రాత్రిపూట స్క్రీన్ లకి దూరంగా ఉంటే కూడా నిద్ర బాగా పడుతుంది. టీవీ కంప్యూటర్ ఫోన్ వంటి వాటికి దూరంగా రాత్రిపూట ఉండండి అప్పుడు కచ్చితంగా మంచి నిద్ర ని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version