పైల్స్ తో బాధపడే వాళ్ళు ఈ ఆహారపదార్ధాలకి దూరంగా వుండండి..!

-

చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్య లో పైల్స్ సమస్య కూడా ఒకటి. అయితే నిజానికి చాలా మంది పైల్స్ సమస్య గురించి మాట్లాడటానికి సిగ్గు పడుతూ ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్లకపోవడం, ఇంట్లో వాళ్లకు చెప్పకపోవడం లాంటివి చేస్తూ ఉంటారు. కాని నిజానికి పైల్స్ సమస్యని వదిలేస్తే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

పైల్స్ వల్ల రక్తం కారడం, నొప్పి కలగడం వంటి ఇబ్బందులు వస్తాయి. అటువంటప్పుడు కూర్చోవడం కూడా కష్టం అవుతుంది. అయితే పైల్స్ సమస్య ఏ వయసు వారికైనా వస్తుంది. పైల్స్ రావడానికి ముఖ్యమైన కారణం కాన్స్టిట్యూషన్, గ్యాస్ సమస్యలు మరియు అజీర్తి సమస్యలు వస్తాయి. అందుకని ఇటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి. అయితే పైల్స్ ఉన్న వాళ్లు ఈ ఆహారపదార్థాలకు దూరంగా ఉంటే మంచిది. మరి వాటి కోసం చూద్దాం.

కారంగా ఉండే ఆహార పదార్థాలు:

పైల్స్ తో బాధపడే వారు కారంగా ఉండే ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. కారంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల నొప్పి ఎక్కువగా వస్తుంది. అలానే రక్తం కారడం వంటి సమస్యలు కూడా ఎదుర్కోవాలి.

ఆల్కహాల్:

మీకు కనుక ఫైల్స్ ఉంటే మందుకు దూరంగా ఉండండి. మందు తాగడం వల్ల ఇబ్బంది మరింత ఎక్కువ అవుతుంది.

డైరీ పదార్థాలు:

డైరీ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గ్యాస్, కాన్స్టిపేషన్, కడుపునొప్పి ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వీటికి కూడా చాలా దూరంగా ఉండండి.

పచ్చి పండ్లు:

పచ్చి పండ్లను తీసుకోవడం వల్ల కూడా పైల్స్ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి వాటిని కూడా తీసుకోవద్దు అలానే ఎక్కువ సాల్ట్ ఉండే ఆహారపదార్థాలు కూడా తీసుకొద్దు. ఇలా వీటికి దూరంగా ఉంటే పైల్స్ సమస్య తో బాధపడే వాళ్లకి మంచిది లేదంటే అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news